ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh education reforms: రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు మంచి రోజులు

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:50 AM

మెరుగైన విద్యా బోధనతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం అనే నినాదంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం వీడిందనడానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

మెరుగైన విద్యా బోధనతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం అనే నినాదంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం వీడిందనడానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమలు చేసిన సంస్కరణలే నిదర్శనం. విద్యావ్యవస్థను పటిష్ఠం చేసి, ఆ వ్యవస్థపై ఆయన తనదైన ముద్ర వేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రణాళికాబద్ధంగా మార్చేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలోనే గతంలో గాడి తప్పిన వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేసి, సఫలమయ్యారు. ఏ మాత్రం కసరత్తు లేకుండా గత ప్రభుత్వం సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియం, ఐబీ అంటూ పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచింది. పాఠశాలల రంగుల కోసం నాడు–నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు గణాంకాలు చూపించింది. కానీ ఒక్క టీచర్‌ని కూడా నియమించలేదు. ఆ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేందుకు లోకేష్ బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ ఏకోపాధ్యాయ స్కూల్ టీచర్ తన స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దిన విషయాన్ని తెలుసుకుని, ఆ ఉపాధ్యాయినిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లను సంస్కరించాలంటే ఏం చేయాలో ఆమె నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. వాటిని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. ఏడాదిలో విద్యాశాఖలో పెను మార్పులు వచ్చాయి. విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల భారం తగ్గించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్య నాణ్యత పెంచడంపై దృష్టి పెట్టారు.

విద్యాశాఖలో రాజకీయ ప్రభావాన్ని తొలగించాలని నిర్ణయించారు. విద్యా కార్యక్రమాలు లేదా విద్యార్థులకు అందించే సామగ్రిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేదా పార్టీ రంగులు ఉండకుండా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యేలా ఒత్తిడి చేయకుండా, వారి విద్యపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జాబ్ ఫెయిర్‌లు తప్ప ఇతర రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లకూడదని ఆదేశించారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గతంలో లేని విధంగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్స్ పెడుతున్నారు. అందరినీ సమన్వయం చేయడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయనే సదుద్దేశంతో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త కరికులం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటర్నల్ మార్కుల విధానాన్ని సీబీఎస్‌ఈ తరహాలో ప్రవేశపెట్టడంతో పాటు జనవరి నాటికి ప్రీ–ఫైనల్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రతిపాదించారు. గతంలో ఉపాధ్యాయులు బహుళ యాప్‌ల వినియోగం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించడానికి వాటి తప్పనిసరి వినియోగాన్ని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ ప్రకటించారు. త్వరలో నియామకాలు పూర్తి అవుతాయి. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు అత్యంత పారదర్శకంగా నిర్వహించి వారి మెప్పు పొందారు. గత ప్రభుత్వంలో దొడ్డిదారిన బదిలీలు చేసి, ఇష్టం వచ్చిన రీతిలో అందిన కాడికి దోచుకున్నారు. అంతేకాకుండా కేటగిరి 1, 2 పోస్టులు బ్లాక్ చేసేవారు. ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని ఖాళీలు చూపించి, బదిలీల ప్రక్రియను విజయవంతం చేసింది.

త్వరలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి అయ్యే అవకాశం ఉండడంతో అన్ని పాఠశాలల్లో ఖాళీలు భర్తీ అయి, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుంది. అలాగే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేయడానికి మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మందికి పైగా సుమారు పదివేల కోట్లు వెచ్చించి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంతమంది అర్హులున్నా ఇవ్వడం భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోతుంది. అది కూడా పాఠశాలలు పునః ప్రారంభ రోజుల్లోనే ఇవ్వడం వల్ల ఆ నిధులను విద్యార్థుల ఫీజులకు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు దుర్వినియోగం అయ్యేవి. అలాగే ఎస్‌ఆర్‌కేవీఎం విద్యా కిట్లు కూడా ఇంటర్ వరకు ఇవ్వడం శుభ పరిణామం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టలేదు, కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అమలు చేసి నిరుపేద విద్యార్థులు ఆకలి తీర్చింది.

రాష్ట్రంలో విద్యను పూర్తి చేసి ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలస పోకుండా, మన విజ్ఞానం మనకే ఉపయోగించాలి అనే నినాదంతో ఇక్కడ చదివిన వారికి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నది. భారీ పెట్టుబడులు సాధించి పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగా వృత్తి నైపుణ్య, ఐటీ, ఏఐ, రంగాన్ని ప్రోత్సహిస్తూ స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా విశేష కృషి జరుగుతోంది. మొత్తంగా విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వాసంశెట్టి సుభాష్

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 01:50 AM