ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Koya Tribe History: కోయ వీరగాథాచక్రం ప్రదర్శన.. డాక్యుమెంటేషన్‌

ABN, Publish Date - May 17 , 2025 | 03:31 AM

కోయ తెగ వీరుల గాథలను సేకరించి డాక్యుమెంటేషన్ చేయడంలో భాగంగా, కోయ వీరతనాన్ని, వారసత్వాన్ని ప్రదర్శించే కార్యక్రమం భద్రాచలం ఐటీడీఏలో జరుగుతుంది. ఈ గాన సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు కోయపెద్దలు, డోలీలు భాగస్వాములవుతున్నారు.

ధునిక మానవుడు అలనాటి ఆదివాసీ వారసుడు. ఏ జాతిలోనైనా ఆ జీవకణజాలం అక్కడ నుండే నేటి వరకు ప్రవహిస్తుంది. కానీ ఆర్థిక–రాజకీయ పరిణామాలు, నగరీకరణ, సాంకేతికాభివృద్ధి వారిని దూరం కొట్టింది. ఆ మూలాల నుండి ఎదిగిన, దూరమైన వాళ్లు వారిని అవమానపరిచారు. వారి జ్ఞానం, సంగీతం, కళలు, సంస్కృతి, భాష వంటి వాటిని పరాయీకరించి వారిని మరింత దూరం చేసుకున్నాం. అలాంటి ఆదివాసీ జాతులలో కోయలు ఒకరు. మధ్యభారతంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో గల వివిధ తెగలు, ఉపతెగలు ఇప్పటికీ ప్రతికూల పరిస్థితులకి ఎదురొడ్డి జీవనపోరాటం చేస్తున్నాయి. వారిని ఉపయోగించుకోవడం పెరిగిపోయింది. వారికి ఏ మేరకు ఉపయోగపడ్డామో పరిశీలన చేసుకోవలసి ఉంది. ఈ సంఘర్షణలో ఆయా తెగల మధ్య అవగాహన పెరగాలి. రాజకీయ, సాంస్కృతిక వైరుధ్యాలను తగ్గించాలి. ముందుగా మనం వారి స్థానికత, ఆచార వ్యవహారాలు, చరిత్ర, భాష, సాంస్కృతిక జీవనం అర్థం చేసుకోవాలి. వీటికి మూలమైన ఆధారాలను సేకరించుకోవాలి. వీటి ఆచూకీని లోతుగా పరిశోధించాలి. వాటిని గ్రంథస్థం చేయాలి.


అందుకు అనేక అధ్యయన బృందాలు ఏర్పడాలి. కోయతెగ వీరవనితలు సమ్మక్క, సారక్కల గురించి కొంత మాత్రమే తెలుసు. వారి సమగ్ర చరిత్ర నిర్మాణం జరగాలి. అందుకే వీరి సమకాలీనుల పోరుచరిత్ర తవ్వితీయాలి. వీరితో పాటుగా ఆ పోరాటంలో మరణించిన వీరులు గుడి కామరాజు, జంపన్న, నాగులమ్మ, ముసలమ్మ, బ్రాహ్మణమ్మ, వెంకటపతిరాజు వంటివాళ్ల వీరగాథల్ని డోలీలు ఈనాటికీ గానం చేస్తున్నారు. తలపతులు ఈ వీరుల చరిత్రని, సంకేతరూపాలను జాగ్రత్తపరుస్తున్నారు. వారి వద్ద డాలుగుడ్డలు, పగిడెలు, కోయపటాలు, వేల్పుగుడ్డలు ఉన్నాయి. వీటిని ప్రదర్శిస్తూ వీరిని గాథల్లో కీర్తించే సంప్రదాయం ఇంకా సజీవం. అయితే కొత్తతరం డోలీగాయకులు తయారుకాకపోవడం వల్ల ఈ గాన సంప్రదాయం చివరి దశకు చేరుకుంది. ముందుగా వీటిని సేకరించడానికి ‘కోయభాష, సంస్కృతి అధ్యయన వేదిక’ లోగడ సమ్మక–సారక్కల గాథని సేకరించింది. ప్రస్తుతం బ్రాహ్మణమ్మ, వెంకటపతి రాజుల గాథల్ని ఈ నెల 18న ఉదయం పది గంటల నుంచి భద్రాచలం ఐటీడీఏలో ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత తలపతులు, డోలీలు, కోయపెద్దలు హాజరవుతారు.

– జయధీర్‌ తిరుమలరావు

పద్దం అనసూయ

ప్రొ. జి. మనోజ

Updated Date - May 17 , 2025 | 03:33 AM