ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Counter Terrorism Actions: కలచివేసిన కశ్మీర్ మారణకాండ

ABN, Publish Date - Apr 25 , 2025 | 05:41 AM

కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల మారణకాండ మానవత్వాన్ని కలచివేసింది. ఉగ్రవాదులకు, వాటిని ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు తప్పవని, అందరూ ఐక్యంగా ఉండి దేశ సమగ్రతకు ప్రమాదం తేవ్యకూడదు అని పిలుపు ఇచ్చారు

టీవల కాలంలో ప్రశాంతంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండ మానవతావాదుల్ని కలచివేసింది. అమాయకులను చుట్టుముట్టి వారి మతాన్ని అడిగి మరీ ముస్లిమేతరులను దారుణంగా చంపడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఈ ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాద సంస్థలు, వాటికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్న వ్యక్తులు, సంస్థలు ఏవైనా కావచ్చు, వాటిని తుదముట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఇలాంటి దుశ్చర్యలను ఎదుర్కోవడంలో ఐక్యంగా ఏక తాటిపై ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ముష్కర చర్యలను ఆసరాగా తీసుకుని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి, అమాయకులను బలితీసుకోవడానికి, దేశంలో అశాంతి, అలజడులను రేకెత్తించి, దేశ సమగ్రతను విధ్వంసం చేయడానికి ప్రయత్నించే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. – సయ్యద్ జుల్ఫికర్ అలీ కలువాయి, నెల్లూరు జిల్లా

Updated Date - Apr 25 , 2025 | 05:42 AM