ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tula Srinivas: తొలి పుస్తకం వచ్చాక చదవాలన్న కాంక్ష మరింత పెరిగింది!

ABN, Publish Date - Aug 18 , 2025 | 06:24 AM

శేషేంద్ర ‘ఆధునిక మహాభారతం’ చదివి ఆయన కవితా నిర్వహణ నైపుణ్యానికి అబ్బురపడ్డాను. నిజానికి అదొక కళాఖండం. చక్కటి భావ చిత్రాలు, ఇమేజరీలు, వాక్యాన్ని కవిత్వం చేసిన తీరు, అలంకారాల ప్రయోగం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?

శేషేంద్ర ‘ఆధునిక మహాభారతం’ చదివి ఆయన కవితా నిర్వహణ నైపుణ్యానికి అబ్బురపడ్డాను. నిజానికి అదొక కళాఖండం. చక్కటి భావ చిత్రాలు, ఇమేజరీలు, వాక్యాన్ని కవిత్వం చేసిన తీరు, అలంకారాల ప్రయోగం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కవిగా నేనేమి చేయాలో, రాయాల్సిన వాక్యం ఎలా ఉండాలో ఆయన కవిత్వం నాకు గుర్తుజేసింది. ఈ సంపుటిలో సంవేదనలు నా రక్తంలోకి చేరాయి. సమాజాన్ని ఇంత డీప్ సీక్ చేసి చూసాడా అనిపించింది!

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవడం గుర్తుంది?

పీజీలో నా మిత్రుడొకడు చలం ‘మైదానం’ బహుమతిగా ఇచ్చాడు. మైదానాన్ని చదవడం వల్ల నా భావనా ప్రపంచం ఎక్స్‌పాండ్‌ అయింది. నెరెటివ్‌లో అంత థిక్‌గా ఎలా రాశాడా అనిపించేది. సంప్రదాయ జీవినైన నాకు సరికొత్త నేత్రాలనిచ్చింది మైదానమే.

మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?

నా ‘చింతలతొవ్వ’ కవిత్వం సంపుటి వచ్చిన తరువాత నాలో చదవాలన్న కాంక్ష మరింత పెరిగింది. అత్యధికంగా పేరు పొందిన పుస్తకాల్లో నిజంగా ఏముందో చదువాలన్న కుతూహలం పెరిగింది. సమాజ గతిని మలుపు తిప్పిన పుస్తకాలను కవి దృష్టితో పరిశీలిస్తున్నాను. లోకల్ లిటరేచర్ తోపాటు అనువాద నవలలు కవిత్వం కథ ఇలా ఏది అందుబాటులో ఉంటే అది చదువుతాను. ఇపుడు నెరుడా కవిత్వం, దాస్తొయెవ్‌స్కీ ‘ఇడియట్’ నవల చదువుతున్నాను. రాయడం సుఖాన్ని ఇస్తే చదవడం ఆనందాన్ని ఇస్తుంది. నాకు సుఖపడటం కంటే ఆనంద పడటమే ఇష్టం.

మీ సమకాలీనంగా కవిత్వపరంగా ప్రేరణ కలిగించే తోటికవులు?

ప్రేరణ కలిగించిన వారిలో మునాసు వెంకట్ గారితో మొదలుకుని కె. శివారెడ్డి, గోరటివెంకన్న, ఎన్. గోపి, ప్రసేన్, నలిమెల భాస్కర్, వంశీకృష్ణ, జూకంటి జగన్నాథం, బొమ్మలబాయి సిద్ధార్థ, కవి యాకూబ్ వంటి లబ్దప్రతిష్టులతో పాటు ఈ తరం కవులు మారాబత్తుల పెద్దన్న, మెట్టా నాగేశ్వరరావుల కవిత్వాన్ని, సాగర్ల సత్తయ్య కథలను ఎక్కువగా చదువుతాను. విభిన్నమైన ఈ రచయితల రచనారీతుల్ని ఆస్వాదిస్తాను.

మీరు ఎక్కువసార్లు చదువుకున్న కవిత్వ సంపుటి?

‘మహాప్రస్థానం’. నా అభ్యుదయ భావాన్ని శ్రీశ్రీ మరింత విస్తృతపరిచాడు. శ్రీశ్రీ శబ్దవేగం హృదయానికి వ్యాయామం. పదాల్లోని గతి శక్తి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ అభ్యుదయావేశం, శబ్ద కవిత్వ ఝరి మహాప్రస్థానాన్ని నన్ను మళ్లీ మళ్లీ చదివించింది.

కవిత్వ రచనలో మీకు ఉపయోగపడిన సలహా?

ఏ సలహా లేకుండానే తొలిసంపుటి ‘చింతలతొవ్వ’ అచ్చేసి, సద్విమర్శకులు ప్రశంసలు అందుకున్నాను. అయితే రెండో సంపుటికి వచ్చిన చాలా సలహాల నడుమ నాకు ఉపయోగపడిందని అనుకున్న సలహా– పొయెటిక్ టెక్నిక్ గురించి. దాన్ని అనుసరించి కేవలం నెరేటివ్‌ మీదనే డిపెండ్ అవ్వకుండా శిల్ప చతురతతో కవితలు అల్లిన విధానం నా రెండో సంపుటిలో చూడొచ్చు.

(తుల శ్రీనివాస్‌ తొలి కవిత్వ సంపుటి ‘చింతల తొవ్వ’

2023లో పబ్లిష్‌ అయ్యింది.) 99485 25853

Updated Date - Aug 18 , 2025 | 06:26 AM