ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏకాంత స్పర్శ

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:31 AM

నీవు నీ నుండి విడిపోయినా సరే నీతో కలసి చేసే ప్రయాణమే ఏకాంతం మెదడు మైదానంలో మనసు అనుభవించే ఘనమైన స్వేచ్ఛ...

నీవు నీ నుండి విడిపోయినా సరే

నీతో కలసి చేసే ప్రయాణమే ఏకాంతం

మెదడు మైదానంలో

మనసు అనుభవించే ఘనమైన స్వేచ్ఛ

నీ తనం తవ్వి తోడే నిజాలు

ఏకాంత స్పర్శకు తడిసి తడిసి

అనుభవం పొలిమేర దాటి

నిజం స్వరంతో విహరిస్తూ పోతే

యాతన ఆంచులపై

కష్టం కళ్ళు మూసుకుని నడిచే ధైర్యానికి

కలల చిరునామా చూపుతూ

కాలం దారి వదులుతుంది

లోకం ఓ ప్రశ్నాపత్రంగా

ఇష్టాలతో పని లేని పరీక్షలో

ఒక్కో ప్రశ్న రాత్రంత పొడవు

ఓ రోజంత బరువు

వయసుకి రెట్టింపు

ఆలోచన కురిసి

మనిషెత్తు తపన పారితేనే

మనసు పదునెక్కి

బతుకు జీవితమయ్యేది

చందలూరి నారాయణరావు

97044 37247

ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 01:31 AM