ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BED Unemployment: బీఈడీ అభ్యర్థులకు అనాదిగా అన్యాయం

ABN, Publish Date - Jul 30 , 2025 | 01:35 AM

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది’ అని కొఠారి కమిషన్ చెప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం, విద్యాశాఖ అనుసరిస్తున్న విధానంతో అటు విద్యార్థుల, ఇటు బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డీఈడీ కోర్సు...

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది’ అని కొఠారి కమిషన్ చెప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం, విద్యాశాఖ అనుసరిస్తున్న విధానంతో అటు విద్యార్థుల, ఇటు బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డీఈడీ కోర్సు పూర్తి చేసి, డీఎస్సీ ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కొన్నేళ్లకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పిస్తోంది. వారిని ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)గా నియమిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఈ ప్రమోషన్ల నియామకాలు ఏ పదో, ఇరవై శాతమో అయితే ఫర్వాలేదు. కానీ ఏకంగా డెభ్బై శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారానే పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తోంది. తద్వారా ఉన్నత పాఠశాలల్లో నేరుగా భర్తీ అయ్యే ఎస్‌ఏ పోస్టుల సంఖ్య భారీగా పడిపోతోంది. దీంతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రతి డీఎస్సీలోనూ నిరాశే మిగులుతోంది. టెట్‌ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో 90శాతం మార్కులు సాధించినా ఫలితం ఉండడం లేదు. 1998కి ముందు వరకు ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీల్లో సగం పోస్టులు డీఎస్సీతో నేరుగానూ, మిగతా సగం పోస్టులు ఎస్జీటీ (సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌)లకు ఎస్‌ఏలుగా ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారానూ భర్తీ చేసేవారు. అలాగే డీఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ రాసుకునే అవకాశం కూడా ఉండేది. కానీ రాజకీయలబ్ధి కోసం నాటి నేతలు 1999లో జీవో–108, జీవో–505 (సవరణ) ద్వారా స్కూల్ అసిస్టెంట్‌ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా 30 శాతం, ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా 70శాతం భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది బీఈడీ అభ్యర్థుల పాలిట శాపంగా పరిణమించింది. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు పోటీపడే విషయంలోనూ మా బీఈడీ అభ్యర్థులకు అన్యాయమే జరుగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులంటూ 2011లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ రాసుకునే అవకాశం కోల్పోయారు. కానీ 2018లో సుప్రీం మరొక తీర్పులో.. బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ రాసుకోవచ్చని, కానీ ఉద్యోగానికి ఎంపికైతే మాత్రం ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని తెలిపింది. 2023లో రాజస్థాన్‌లో డీఈడీ అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించగా... బీఈడీ అభ్యర్థులు డీఎస్సీలో ఎస్జీటీ పరీక్ష రాసే అవకాశాన్ని తొలగిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అటు నేరుగా పోస్టులు లేక, ఇటు ఎస్జీటీ రాసుకునే వెసులుబాటు లేకపోవడంతో బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేరళ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను 25 శాతం ప్రమోషన్లతోనూ, 75 శాతం నేరుగానూ అక్కడి ప్రభుత్వం భర్తీ చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లోనూ 66.66 శాతం ప్రత్యక్షంగా (పరీక్షల ద్వారా), 33.33 శాతం ప్రమోషన్ల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత ఏడాది ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాం. హైకోర్టును ఆశ్రయించాం. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్ చైర్మన్లతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదు. దీంతో మా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా బీఈడీ అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను 80 శాతం నేరుగా, 20 శాతం మాత్రమే ప్రమోషన్లతో భర్తీ చేయాలి. ప్రభుత్వ, గురుకుల (జేఎల్, పీజీటీ, టీజీటీ), మోడల్ స్కూల్ (పీజీటీ, టీజీటీ), పీడీ, పీఈటీ వంటి ఉపాధ్యాయ ఖాళీలను నేరుగా ఒకే డీఎస్సీలో భర్తీ చేయాలి. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. మా డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 3 నుంచి 7 వరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి హైదరాబాద్‌లోని SCERT (విద్యా కమిషన్‌) కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించబోతున్నాం. ఈ యాత్రకు బీఈడీ అభ్యర్థులంతా కదలిరావాలి. ఈ ర్యాలీ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.

కోటగిరి కిరణ్‌కుమార్

బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 01:37 AM