Dalai Lama: 130 ఏళ్లు... సాధ్యమేనా?
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:26 AM
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తన 90వ పుట్టినరోజు సందర్భంగా తాను ఇంకా 40 సంవత్సరాలు అంటే 130 ఏళ్ళు బతుకుతానని ఏ ఆధారాలతో సెలవిచ్చారో తెలియదు.
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తన 90వ పుట్టినరోజు సందర్భంగా తాను ఇంకా 40 సంవత్సరాలు అంటే 130 ఏళ్ళు బతుకుతానని ఏ ఆధారాలతో సెలవిచ్చారో తెలియదు. బహుశా ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలను బట్టి తన జీవితకాలాన్ని నిర్ణయించుకున్నారేమో. ఆశీర్వచనం చేసేటప్పుడు పెద్దలు ‘శతమానం భవతి’ అంటారు. శతం అంటే నూరు, మానం అంటే ఇరవై అంటే నూట ఇరవై పున్నములన్న మాట. ఈ వేదోక్తమయిన ఆశీర్వాదం కూడా వాస్తవరూపం దాల్చడం లేదు. ఎందుకంటే ఆరోగ్య సూత్రాలను పద్ధతి ప్రకారం ఎవరూ పాటించలేరు కాబట్టి. యోగా గురువు రామ్‌దేవ్ బాబా ఎప్పుడో ఓ సందర్భంలో తాను 200 సంవత్సరాలు జీవిస్తానని అన్నట్టు గుర్తు. ఇప్పుడు కొత్తగా కృత్రిమ మేధను ఉపయోగించి జీవనకాలాన్ని 150 ఏళ్ళకు పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఎన్నాళ్ళు బతికినా మంచాన పడక, ఎవరి చేతా సేవలు చేయించుకోకుండా అనాయాస మరణాన్ని కోరుకోవాలి. అయినా దానికి కూడా పెట్టి పుట్టాలంటారు.
– డా. ఎన్.ఎస్.ఆర్. మూర్తి సికింద్రాబాద్
Updated Date - Jul 16 , 2025 | 01:26 AM