G Haragopal: పుస్తకావిష్కరణ సభ
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:42 AM
ప్రజాస్వామ్య వికాసానికి చర్చల దోహదాన్ని అర్థం చేసుకుంటూ, హింస తగ్గాలని ఆకాంక్షిస్తూ..
ప్రజాస్వామ్య వికాసానికి చర్చల దోహదాన్ని అర్థం చేసుకుంటూ, హింస తగ్గాలని ఆకాంక్షిస్తూ, హింసలేని మానవీయ ప్రజాస్వామిక విలువల నూతన సమాజాన్ని మానవులే నిర్మించుకోగలరనే విశ్వాసంతో రెండున్నర దశాబ్దాలుగా ప్రొ. జి.హరగోపాల్ శాంతి చర్చల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఆయన ఇచ్చిన రెండు ఇంటర్వ్యూలు, ఎస్.ఆర్. శంకరన్ స్మారకోపన్యాసం, మరి రెండు ఉపన్యాసాలు కలిపి ‘శాంతి చర్చలు–ప్రజాస్వామిక అన్వేషణ’ పుస్తకం ప్రచురించాం. శాంతి కోసం, నిర్బంధం లేని సమాజం కోసం చర్చలు ఎంత అవసరమో శాంతి చర్చలకు, శాంతి సాధనకు నిరంతర సంభాషణ కూడా అంత అవసరం. జూలై 27న ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రొ. జి.హరగోపాల్ పుస్తకం ‘శాంతి చర్చలు–ప్రజాస్వామిక అన్వేషణ’ ఆవిష్కరణ సభ జరుగుతుంది. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి హాల్‌లో జరిగే ఈ సభలో రాజేంద్రబాబు అర్విణి, ప్రొ. జి.విజయ్, జస్టిస్ బి.చంద్రకుమార్, ప్రొ. డి.ఎన్, ప్రొ. రమా మెల్కొటే, ప్రొ. లక్ష్మణ్ గడ్డం, ప్రొ. జి.హరగోపాల్, ఎం. రాఘవాచారి, పి.బి. స్వామి పాల్గొంటారు.
–పాలమూరు అధ్యయన వేదిక
Updated Date - Jul 26 , 2025 | 12:42 AM