Indian Farmers: రైతునేస్తం అవార్డు దరఖాస్తులకు ఆహ్వానం
ABN, Publish Date - Sep 06 , 2025 | 02:28 AM
రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ‘పద్మశ్రీ’ పురస్కృతులు స్వర్గీయ డా. ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ..
‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ‘పద్మశ్రీ’ పురస్కృతులు స్వర్గీయ డా. ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతో పాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను అవార్డులతో సత్కరించనున్నారు. ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకునేవారు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్ https://rythunestham. in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి సెప్టెంబర్ 15వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్–500004. ఫోన్: 96767 97777 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం., గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.inకు ఇ–మెయిల్ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
– యడ్లపల్లి వేంకటేశ్వరరావు
చైర్మన్, రైతునేస్తం ఫౌండేషన్
Updated Date - Sep 06 , 2025 | 02:28 AM