ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Congress Janahita Yatra: జనహిత యాత్ర పరమార్థమేమిటి

ABN, Publish Date - Aug 06 , 2025 | 03:00 AM

భారత జాతీయ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును

భారత జాతీయ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆసేతు హిమాచలం సమస్త ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు సైతం నిశితంగా గమనిస్తున్నారు. భారతదేశ వ్యవహారాలపై ఆసక్తి చూపే విదేశీ మేధావులు, దౌత్యవేత్తలు కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో పాటు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏమిటని శ్రద్ధగా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో పర్యటించి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా తమ సమావేశాలలో ఏ మంత్రి ఏ విధంగా, కుర్చీపై రెండు కాళ్లు వేసుకుని కూర్చున్నారు అనే విషయంతో సహా వివిధ విశేషాలపై ఛలోక్తులు విసురుతుంటారు.

ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి ప్రభావశీలంగా తీసుకువెళ్లేందుకు అధికార పార్టీ అంకితభావంతో కృషి చేస్తేనే రాజకీయ ప్రయోజనాలు సమకూరుతాయి. తెలంగాణలో ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తున్నా అందుకు తగినట్లుగా ప్రజాదరణ పొందలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జనహిత యాత్ర పేరిట కాంగ్రెస్‌ నాయకత్వం ప్రజల మధ్యకు వెళ్లేందుకు పూనుకోవడం ముదావహం. జిల్లాలలో పార్టీ స్ధానిక నాయకులు, స్ధానిక ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించి, ఆ తరువాత క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని బేరిజు వేసేందుకు పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పల్లెలు. పట్టణాలలో పర్యటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ తరహా కసరత్తు ఏమి లేకుండా తెలంగాణ పీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత యాత్ర జన సమస్యల పరిష్కారానికి చేసే మేలు ఏమోగానీ కనీసం పార్టీ ఆత్మావలోకనం చేసుకోవడానికీ అయినా ఎంత వరకు దోహదం చేస్తుందో తెలియదు. అధికారిక లావాదేవీలు (పైరవీలు అని చెప్పడం సబబుగా లేదు) చేసేవారు పెరిగిపోయి నిజమైన పార్టీ నాయకులు దాదాపుగా కరువైపోయిన రోజులివి. పార్టీ గురించి చిత్తశుద్ధితో పట్టించుకునేవారు అసలు ఉన్నారా? బహుశా, ఈ కారణానే కాబోలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేపట్టిన కొన్ని సాహసోపేత చర్యలు, అమలుపరిచిన పథకాల గురించి జనాలలో ఆశించిన స్ధాయిలో స్పందన లేదు.

దేశంలో ఇప్పటి వరకు కేరళతో సహా ఏ ఇతర రాష్ట్రం కూడ గల్ఫ్ దేశాలలో మరణించిన మృతులకు రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందించలేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే అనేక మందికి ఇటువంటి సహాయం అందింది. అయితే గ్రామాలలో ఈ ప్రజాహిత చర్యకు సరైన ప్రచారం లభించలేదు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కొద్ది కాలం క్రితం కలిసినప్పడు ఈ విషయమై ప్రశ్నించాను. ప్రభుత్వాధినేతగా తాను అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులదని ఆయన మందహాసంతో సమాధానమిచ్చారు. ఇది ఆయన మనోగతాన్ని కొంతవరకు విశదీకరించింది. విదేశాలలో మంచి స్థితిలో ఉన్న ప్రవాసుల కంటే స్వదేశంలో వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారత్‌లో యూరియా, ఇతర ఎరువుల కొరత దృష్ట్యా వాటి దిగుమతి తీరును పరిశీలించడానికి సౌదీ అరేబియాకు వచ్చిన (బీజేపీ అధ్యక్షుడు కూడా అయిన) కేంద్ర ఎరువుల మంత్రి జె.పి.నడ్డాకు ఒక నిమిషం కూడ తీరిక లేదు. అయినా ఆయన తన పార్టీ మద్దతుదారుల కొరకు కొంత సమయాన్ని కేటాయించారు. అంతకు ముందు వ్యక్తిగత పని నిమిత్తం దుబాయి పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీ, బీజేపీకి మద్దతునిచ్చే ప్రవాస ప్రముఖులు అందరినీ విందుకు ఆహ్వనించారు. ధర్మపురి అర్వింద్ వచ్చినప్పుడల్లా కార్యకర్తలను ఉత్తేజపరుస్తారు. కాంగ్రెస్ విషయానికి వస్తే, కేరళ ముఖ్యనాయకులు అందరూ తరుచుగా సందర్శిస్తూ తమ పార్టీ ప్రవాస విభాగాన్ని పటిష్ఠ వ్యవస్థగా తీర్చిదిద్దారు. గల్ఫ్‌లోని పార్టీ నాయకులతో సంప్రదింపులలో ఉండే పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ త్వరలో పార్టీ కార్యక్రమం ఒకదానిలో పాల్గొనేందుకు కువైత్‌కు రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ మృతులకు అందించిన ఆర్ధిక సహాయంపై వివరాలతో వెళ్ళి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిన ఒక ప్రవాస కాంగ్రెస్ నాయకుడిని నిజామాబాద్ జిల్లాలో ప్రతిపక్ష భారాస కార్యకర్తలు బట్టలు విప్పి కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రవాస నాయకుడిని కనీసం పరామర్శించే తీరిక కూడ తెలంగాణ పీసీసీ నాయకులకు లేకుండా పోయింది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులు తరుచు దుబాయి పర్యటనలకు వస్తున్నా, స్థానికంగా ఉన్న కాంగ్రెస్‌ మద్దతుదారులను కనీసం కలువడానికి కూడా ఇష్టపడరు. వారిని వీలయినంత దూరంగా ఉంచుతారు. నాయకుల ఇటువంటి వైఖరి వల్లే ప్రజలూ పార్టీలనూ అధికారం నుంచి దూరంగా ఉంచుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమ జనహిత యాత్రలో ఈ సత్యాన్ని గ్రహిస్తే చాలు.

-మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Aug 06 , 2025 | 03:00 AM