ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారికి భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి

ABN, Publish Date - Aug 23 , 2025 | 02:11 AM

నేడు రాశిఫలాలు 23-8-2025 - శనివారం , చిన్నారుల ఆరోగ్యం కలవరపెడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక నిరుత్సాహ పడతారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులకు అనుకూల సమయం.

నేడు రాశిఫలాలు 23-8-2025 - శనివారం , చిన్నారుల ఆరోగ్యం కలవరపెడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక నిరుత్సాహ పడతారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులకు అనుకూల సమయం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల ఆరోగ్యం కలవరపెడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక నిరుత్సాహ పడతారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులకు అనుకూల సమయం. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలు సఫలం అవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. తోబుట్టువులు, సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. విలువైన పత్రాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాహ్నం నుంచి పెట్టుబడులు లాభిస్తాయి. అదనపు ఆదాయం సమకూర్చుకోవడంలో సన్నిహితులు సహకరిస్తారు. ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మేలు. ఖర్చులు అంచనాలు మించే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం నుంచి కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన ఒక రహస్య సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉదయం 11 గంటల తరువాత పట్టుదలతో కృషి రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అదనపు ఆదాయం అందుకుంటారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చల్లో ఆచితూచి వ్యవహరించడం మేలు. మీ అంచనాలు ఫలించపోవడంతో నిరాశకు గురవుతారు. మధ్యాహ్నం నుంచి సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. న్యాయ, రవాణా, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలించపోవచ్చు. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌, ఐరన్‌; హార్డ్‌వేర్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించిపోతాయి. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం నుంచి వేడుకల్లో పాల్గొంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

Updated Date - Aug 23 , 2025 | 02:11 AM