ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారికి మార్పులు బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి

ABN, Publish Date - Jul 18 , 2025 | 03:42 AM

నేడు రాశిఫలాలు 18-07-2025 శుక్రవారం, మార్పులు, బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది...

నేడు రాశిఫలాలు 18-07-2025 శుక్రవారం, మార్పులు, బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

మార్పులు, బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. తల్లిందండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. దుర్గామాతను ఆరాఽధించండి.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాల్లో, విదేశీ విద్య కోసం చే సే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. గాయత్రీ మాతను ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. పైఅధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. అంచనాలు ఫలించకపోవచ్చు. రాజకీయాలు, ప్రచురణలు, న్యాయ, బోధన, రవాణా, సాంస్కృతిక రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. దూర ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. గోమాతను ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాఇ. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వారసత్వ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంలో సమస్యలు ఎదురవుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగస్తుంది. పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆంటకాలు ఎదురవుతాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆహారం విషయంలో పరిమితి పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. షాపింగ్‌లో నాణ్యత గమనించండి. ఖర్చులు అధికం. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

మార్కెటింగ్‌, రవాణా, బోదన రంగాల వారు అచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు కాదు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో అచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఫీజులు, బిల్లుల చెల్లింపు కోసం అవసరమైన నిధులు సకాలంలో సర్దుబాటు కాకపోవచ్చు. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అధికం. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 18 , 2025 | 03:43 AM