ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగాలల్లో పెట్టుబడులను సమీక్షించుకుంటారు

ABN, Publish Date - Sep 06 , 2025 | 02:03 AM

నేడు రాశి ఫలాలు 6-9-2025 - శనివారం, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు...

నేడు రాశి ఫలాలు 6-9-2025 - శనివారం, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. సమావేశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అంచనాలు మించుతాయి. గోసేవ శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

టెలివిజన్‌, విద్య, ఆడిటింగ్‌, ప్రకటనల రంగాల వారు వృత్తి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ వేంకటేవ్వర వజ్రు కవచ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సమావేశాలు, ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. బృందకార్యక్రమాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య కోసం ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ముఖమైన సమాచారం అందుకుంటారు. శ్రీ విష్ణు సహస్ర నామపారాయణ శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విందు వినోదాల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. శ్రీ వేంకట్వేర స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

టెలివిజన్‌, క్రీడలు, ఆడిటింగ్‌, విద్యా సంస్థల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. దూరప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందుకోవాల్సి రావచ్చు. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. విష్ణు మూర్తిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు పెట్టుబడులను సమీక్షించుకుంటారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వ్యవహారశైలి ఆవేదన కలిగిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మార్కెటింగ్‌, రవాణా, బోధన, కమ్యూనికేషన్‌ రంగాల వారు నిదానం పాటించాలి. ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా సరైన ఫలితాలు అందుకోలేకపోతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. గోమాతను ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

విదేశీ ప్రయాణాలు, పైచదువులకు అవసరమైన నిధులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలించకపోవచ్చు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

మూచ్యువల్‌ ఫండ్స్‌, పొదుపు పథకాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాల తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కొత్త పథకాల అమలును వాయిదా వేయడం మంచిది. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. గోమాత ఆరాధన మేలు చేస్తుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌, సినిమాలు, రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో అపవాదులు ఎదురవుతాయి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Sep 06 , 2025 | 02:03 AM