ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి

ABN, Publish Date - Oct 15 , 2025 | 12:24 AM

నేడు రాశిఫలాలు 15-10-2025 బుధవారం ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.

నేడు రాశిఫలాలు 15-10-2025 బుధవారం ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. క్రీడలు, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. హార్డ్‌వేర్‌, గృహాలంకరణ, రిటైల్‌ వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలమైన రోజు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు అనుకూలమైన రోజు. కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రియతమల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. మార్కెటింగ్‌, రవాణా, ఏజెన్సీలు, కమ్యూనికే షన్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరమైన రోజు.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరినికి సమీక్షించుకుంటారు. ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వ్యాపారస్తులు, రిప్రజెంటేటివ్‌లు, స్టేషనరీ డీలర్లు మంచి లాభాలు ఆర్జిస్తారు. విలువైన సమాచారం లేదా పత్రాలు అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో మంచి ఫలితాఉల సాధిస్తారు. తోబుట్టువుల విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయాలు, ఎగుమతులు, బోధన, కళలు, ఫొటోగ్రఫీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలంగా రావల్సిన బకాయిలు వసూలవుతాయి. ఉన్నత విద్య కోసం అవరసమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెట్టుబడుల, పొదుపు పథకాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. బంధుమిత్రుల ప్రవర్తన అనందం కలిగిస్తుంది. యూనియన్‌ కార్యకలాపాలు, కంపెనీ విషయాల్లో ముఖ్యపరిణామాలు జరుగుతాయి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగు, వ్యాపారాల్లో చికాకులు తొలగిపోయి ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో మీ గత అనుభవం తోడ్పడుతుంది. రాజకీయ ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రవాణా, బోధన, న్యాయ, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ఆనుకూలమైన రోజు. వేడుకల కోసం ఖర్చు చేస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల సహకారంతో ఆర్ధిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, పెట్టుబడుల విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బాంధవ్యాలు, పరిచయాలు విస్తరిస్తాయి. కొత్తపరిచయాలతో లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ప్రోత్సాహకరంగా జరుగుతాయి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్‌, క్యాటరింగ్‌, ఫార్మసీ వ్యాపారులు అదనపు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 15 , 2025 | 07:50 AM