ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు

ABN, Publish Date - Jul 21 , 2025 | 01:37 AM

నేడు రాశిఫలాలు 21-07-2025 సోమవారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లకు అనుకూలం...

నేడు రాశిఫలాలు 21-07-2025 సోమవారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లకు అనుకూలం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లకు అనుకూలం. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉదయం పది గంటల నుంచి వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం ఉదయం పది గంటల నుంచి విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లులు, చెక్కులు మంజూరు కావడంలో జాప్యం జరగవచ్చు. పరమశివుని ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఉదయం పది గంటల తరువాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోతారు. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. ఉదయం పది గంటల తరువాత అనుకోని చిక్కులు ఎదురుకావడంతో మనశ్శాంతి కోల్పోతారు. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు,. ఉదయం పది గంటల తరువాత ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రదర్శనలు, ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు. పరమశివుని ఆరాధించడం శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఉదయం పది గంటల తరువాత ఉద్యోగ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో నిరాశతప్పకపోచ్చు. బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఉదయం 10 గంటల తరువాత ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారు వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సమావేశాల్లో పైఅధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. పరమశివుని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రుణప్రయత్నాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. ఉదయం పది గంటల తరువాత పన్నులు, బీమా, పెన్షన్‌, గ్రాట్యుటీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మెడికల్‌ క్లెయిముల మంజూరులో జాప్యం జరుగుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిధుల విషయంలో బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. గోమాతను ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉదయం పది గంటల నుంచి పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారు సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో ఇబ్బంది పడతారు. వైద్యం, హోటల్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. ఉదయం పది గంటల తరువాత సినిమాలు, టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. శివ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉదయం 10 గంటల తరువాత రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. పరమశివుని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 21 , 2025 | 01:37 AM