ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారికి వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది

ABN, Publish Date - Aug 08 , 2025 | 01:49 AM

నేడు రాశి ఫలాలు 8-08-2025 శుక్రవారం, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది...

నేడు రాశి ఫలాలు 8-08-2025 శుక్రవారం, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత నుంచి ఆడిటింగ్‌, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. దుర్గాష్టక పారాయణ మేలు చేస్తుంది.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకంటాయి. మధ్యాహ్నం నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చ ర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. అన్నదానం శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం తరువాత పెన్షన్‌, మూచ్యువల్‌ ఫండ్స్‌ వ్యవ హారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. గోమాత ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 23 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదరవుతాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. మధ్యాహ్నం నుంచి జనసంబంధాలు విస్తరిస్తాయి. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారు ఆచితూచి వ్యవహరించాలి. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. మధ్యాహ్నం తరువాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ దుర్గా అష్టోత్తరశతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్‌ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతంది. లలితా దేవిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లలో ఆసౌకర్యం కలిగే అవకాశం ఉంది. భూమి లావాదేవీలు, నిర్మాణ విషయాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. తోబుట్టువులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్త అవసరం. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. మధ్యాహ్నం తరువాత ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిధులు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరీదేవి ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకలు, సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. అమ్మవారి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకు)

సినిమాలు, రాజకీయ రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. మధ్యాహ్నం తరువాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 08 , 2025 | 01:49 AM