ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే..

ABN, Publish Date - Apr 21 , 2025 | 04:57 PM

Akshaya Tritiya 2025: కొన్ని రాశుల వారికి ఈ యోగాలు శుభాన్ని కలిగిస్తాయని, ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణుల మాట. ముఖ్యంగా ఐదు రాశుల వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్టం మారనుందట.

Akshaya Tritiya 2025

అక్షయ తృతీయను హిందువులు ఎంతో సంప్రదాయంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది వైశాఖ మాసం శుక్ల పక్షంలో తృతీయ సందర్భంగా అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అక్షయ అంటే అంతులేదని అని.. అక్షయ తృతీయ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భక్తుల విశ్వాసం. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి, కొత్త వస్తువులు కొనేందుకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. బంగారం, వెండి కొనడం వల్ల సంపదలకు అధిపతి అయిన లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుందని గట్టి నమ్మకం. ఈసారి అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైనదని.. ఈరోజు అనేక శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గజకేసరి యోగం, లక్ష్మీనారాయణ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలగలిసిన ఈ ఏడాది అక్షయ తృతీయ అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారికి ఈ యోగాలు శుభాన్ని కలిగిస్తాయని, ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణుల మాట. ముఖ్యంగా ఐదు రాశుల వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్టం మారనుందట. ఏయే రాశులకు అదృష్టం వరించనుంది.. వారికి ఏం శుభం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.


వృషభం, కర్కాటకం, తుల రాశి, మకర రాశి, కుంభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి వారి అదృష్టం మారబోంతోదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వారి వ్యాపారాల్లో వృద్ధి చేకూరనుంది. ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అక్షయ తృతీయ వారి జీవితాలల్లో ఎంతో ఆనందాన్ని తీసుకురాబోతంది. ఇప్పుడు ఒక్కో రాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.


వృషభ రాశి: ఈ రాశి వారు అక్షత తృతీయ నాడు వ్యాపారంలో మంచి లాభాలను అర్జిస్తారు. అమ్మకాలు పెరగడంతో పాటు పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. జీతాల పెరిగే అవకాశం ఉంటుంది. వీరి బ్యాంకు బ్యాలెన్స్ అధికమవుతుంది. పెట్టిన పెట్టుబడిలో మంచి రాబడి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


కర్కాటక రాశి: ఈ రాశి వారికి మంచి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. వృత్తి, వ్యాపారాల్లో చాలా పురోగతి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్‌లో పనిచేసే వారికి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అక్షయ తృతీయ ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


తుల రాశి: అక్షత తృతీయ రోజు సంపద భారీగా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఆ రోజుకు పూర్తవుతాయి. అంతేకాకుండా బ్లాక్ అయిన నిధులు అందుతాయి. కొత్త వనరుల నుంచి డబ్బు సంపాదించేందుకు ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే వాహనం, ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.


మకర రాశి: అక్షయ తృతీయ ప్రభావంతో ఈ రాశి వారు లక్ష్మీ దేవి, శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. దీంతో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త వనరుల నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగాన్ని మొదలు పెట్టేందుకు అక్షయ తృతీయ చాలా శుభ దినం.


కుంభ రాశి: ఈ రాశి వారికి అక్షయ తృతీయ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. బ్లాక్ అయిన నిధులు వెంటనే వచ్చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. కేరీర్ పరంగా సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.


ఇవి కూడా చదవండి.

Hyderabad: ఆ కేసులో కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Read Latest Devotional News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:57 PM