ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి దుశ్చర్య.. ఎంతకి తెగించాడంటే..

ABN, Publish Date - Jan 26 , 2025 | 07:21 AM

నెల్లూరు: ప్రేమోన్మాదుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేయసి కోసం ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించలేదని ఓ పక్క యువతులను చంపేస్తూ.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని మరోపక్క అమ్మాయిల కుటుంబసభ్యులపైనా దాడులకు తెగబడుతున్నారు.

Nellore

నెల్లూరు: ప్రేమోన్మాదుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేయసి కోసం ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించలేదని ఓ పక్క యువతులను చంపేస్తూ.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని మరోపక్క అమ్మాయిల కుటుంబసభ్యులపైనా దాడులకు తెగబడుతున్నారు. కత్తులతో హత్యలు చేస్తూ, యాసిడ్ దాడులతో కుటుంబాలను చిదిమేస్తున్నారు. చట్టాలు పటిష్టంగా అమలు చేస్తున్నా.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో మాత్రం భయం కలగడం లేదు. కేవలం ప్రేయసిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు.


తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. ప్రేయసితో పెళ్లి చేయడం లేదని ఆమె తండ్రిని హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. నెల్లూరు శ్రీనివాస్ నగర్‌లో మహబూబ్ బాషా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు.. మహబూబ్ బాషా కుమార్తె వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మెుదట అతని ప్రేమను తిరస్కరించిన యువతి ఆ తర్వాత అంగీకరించింది. అయితే మహబూబ్ బాషా ఇంటికి వెళ్లిన సాదిక్ ప్రేమ విషయాన్ని చెప్పాడు. బాషా వారి పెళ్లి చేసేందుకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విధంగా సాదిక్ పలుమార్లు అడిగినా బాషా మాత్రం వివాహానికి నిరాకరించారు. దీంతో సాదిక్ కోపంతో రగిలిపోయాడు.


ఎలాగైనా ప్రేయసిని పొందాలని భావించిన సాదిక్ ప్రేయసి తండ్రి మహబూబ్ బాషాను అడ్డు తొలగించుకోవాలనే దారుణ నిర్ణయానికి వచ్చాడు. అనంతరం పదునైన ఓ కత్తిని కొనుగోలు చేశాడు. స్థానిక బ్యాకరీలో బాషా పని చేస్తున్నట్లు తెలుసుకుని పక్కా పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టాడు. బాషా కోసం కాపుకాసిన నిందితుడు అదును చూసి అతనిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాషా రక్తపు మగుడులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలో పెను సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - Jan 26 , 2025 | 07:22 AM