Young doctor: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:31 PM
శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ డాక్టర్(Young doctor) మృతి చెందగా, మరో యువ డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగ్ పోలీసులు(Narsingh Police) తెలిపిన వివరాల మేరకు.. బాచుపల్లికి చెందిన డాక్టర్ వి.జస్వంత్ (24), ఎల్‌బీనగర్‌కు చెందిన డాక్టర్ భూమిక ఎల్‌బీనగర్ లోని కామినేని ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌లుగా పనిచేస్తున్నారు.
- మరో డాక్టర్‌కు తీవ్ర గాయాలు
హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ డాక్టర్(Young doctor) మృతి చెందగా, మరో యువ డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. నార్సింగ్ పోలీసులు(Narsingh Police) తెలిపిన వివరాల మేరకు.. బాచుపల్లికి చెందిన డాక్టర్ వి.జస్వంత్ (24), ఎల్‌బీనగర్‌కు చెందిన డాక్టర్ భూమిక ఎల్‌బీనగర్ లోని కామినేని ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్‌హౌ్‌సలో ఫంక్షన్‌కు వెళ్లి శనివారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు. రెండు కిలోమీటర్లు హైదరాబాద్(Hyderabad) వైపు రాగానే ఖానాపూర్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న హోర్డింగ్ యూనిపోల్‌ను వారి కారు ఢీకొట్టింది.
ఈ వార్తను కూడా చదవండి: ఇంటి అద్దె చెల్లించలేని దీనస్థితి.. తల్లి మృతదేహం చెంత కుమార్తెల కేసులో దర్యాప్తు ముమ్మరం
డ్రైవింగ్ సీట్లో ఉన్న జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, పక్క సీటులో ఉన్న భూమిక తీవ్రగాయాలపాలయ్యారు. గమనించిన కొందరు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకుని భూమికను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జస్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. డాక్టర్ నిద్రమత్తులో ఉన్నాడా, మద్యం తాగి ఉన్నాడా అనే విషయాలు పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు.
మెడికల్ కళాశాలలో నిశ్శబ్ద వాతావరణం..
మన్సూరాబాద్: నార్సింగి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటనతో ఎల్బీనగర్ కామినేని మెడికల్ కళాశాలలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న జస్వంత్, భూమిక ఇంటర్న్‌షిప్ చివరి దశలో ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News
Updated Date - Feb 02 , 2025 | 01:31 PM