ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Woman In Ambulance: హోమ్ గార్డ్ టెస్టుకు వచ్చిన యువతిపై దారుణం.. అంబులెన్స్‌లో అత్యాచారం..

ABN, Publish Date - Jul 26 , 2025 | 02:54 PM

Woman In Ambulance: అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లతో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని యువతి ఆరోపిస్తోంది.

Woman In Ambulance

బీహార్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. హోమ్ గార్డ్ సెలెక్షన్లలో పాల్గొన్న ఓ యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సెలక్షన్ల సందర్భంగా స్ప్రహ తప్పిపడిపోయిన యువతిని అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా డ్రైవర్, మరో వ్యక్తి కలిసి అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గయ జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి జులై 24వ తేదీన జరిగిన హోమ్ గార్డ్ సెలెక్షన్ ప్రాసెస్‌లో పాల్గొంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ జరుగుతున్నపుడు యువతి స్ప్రహ తప్పిపడిపోయింది.

అధికారులు వెంటనే అంబులెన్స్‌ను రప్పించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లతో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని యువతి ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంబులెన్స్ ప్రయాణించిన రూటులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.

యువతిపై అత్యాచారం చేసింది ఇద్దరా లేక అంతకంటే ఎక్కువ మందా అన్న దానిపై క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇక, ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ఈ సంఘటనపై స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. పోలీసుల పని తీరు అస్సలు బాగోలేదని అన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ

‘గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు వేయండి’

Updated Date - Jul 26 , 2025 | 03:02 PM