ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల’ వేధింపులకు ఇద్దరు బలి

ABN, Publish Date - Jan 24 , 2025 | 10:07 AM

ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల నిర్వాహకుల వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌ గౌడ్‌(31) హైదరాబాద్‌(Hyderabad)లో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.

- అల్వాల్‌ కానాజీగూడలో ఆటో డ్రైవర్‌

- కామారెడ్డి జిల్లాలో యువకుడు

హైదరాబాద్: ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల నిర్వాహకుల వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని బీబీపేట మండలం తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్‌ గౌడ్‌(31) హైదరాబాద్‌(Hyderabad)లో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం తుజాల్‌పూర్‌లో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనికోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ.3లక్షల రుణం తీసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Website: వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌


అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో రెండు నెలలుగా వాయిదాలు కట్టడం లేదు. దీంతో వాయిదాలు చెల్లించాలంటూ ఫైనాన్స్‌ సిబ్బంది ప్రవీణ్‌ను మూడు రోజులుగా ఫోన్‌లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో అతను గత మంగళవారం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చి డబ్బులు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినా సర్దుబాటు కాలేదు. ఫైనాన్స్‌(Finance) నిర్వాహకుల వేధింపులకు తోడు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్‌ బుధవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.


ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు తన సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. గురువారం తెల్లవారుజామున గ్రామ శివారులో చెట్టుకు ప్రవీణ్‌ ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. కానాజిగూడ యాదమ్మనగర్‌(Kanajiguda Yadammanagar)లో ఉండే కుర్మయ్య (55) ఆటో డ్రైవర్‌. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


కుర్మయ్య గత ఏడాది తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో రుణం తీసుకొని కొత్త ఆటో కొన్నాడు. వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకులు నెల క్రితం ఆటోను తీసుకెళ్లారు. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 10:07 AM