Secunderabad: ఇంటి అద్దె చెల్లించలేని దీనస్థితి.. తల్లి మృతదేహం చెంత కుమార్తెల కేసులో దర్యాప్తు ముమ్మరం
ABN, Publish Date - Feb 02 , 2025 | 12:48 PM
తల్లి మృతదేహంతో 8 రోజుల పాటు ఇద్దరు కుమార్తెలు జీవనం సాగించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ(Osmania University) పరిధిలో నివసించే లలిత భర్త రాజు ఓ హత్య కేసులో నిందితుడిగా మారడంతో ఐదేళ్ల క్రితం వారు విడిపోయారు.
తల్లి మృతదేహం చెంత కుమార్తెల కేసులో దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్: తల్లి మృతదేహంతో 8 రోజుల పాటు ఇద్దరు కుమార్తెలు జీవనం సాగించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ(Osmania University) పరిధిలో నివసించే లలిత భర్త రాజు ఓ హత్య కేసులో నిందితుడిగా మారడంతో ఐదేళ్ల క్రితం వారు విడిపోయారు. అప్పటి నుంచి తన ఇద్దరు కుమార్తెలు రవల్లిక, అశ్వితలతో కలిసి ఆమె వారాసిగూడ(Varasiguda)లో ఉంటుంది. ఈ క్రమంలో లలిత అనారోగ్యంతో మృతిచెందగా కుమార్తెలు ఇద్దరూ తల్లి మృతదేహంతో ఎనిమిది రోజుల పాటు గడిపారు. గత మూడు నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించడం లేదని, జనవరి 27న అద్దెకోసం వెళ్తే తలుపు తీయకుండా మొండికేశారని ఇంటి యజమాని చెప్పాడు.
ఈ వార్తను కూడా చదవండి: KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
అయితే అప్పటికే లలిత చనిపోయి ఉండవచ్చని, అందుకే తలుపులు తీయలేదని పోలీసులు భావిస్తున్నారు. గాంధీ మార్చురీ వద్ద ఇద్దరు కూతుళ్లును మీడియా ప్రశ్నించగా ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. గత నెల 25న లలిత కుమార్తెలు రాసిన సూసైడ్ నోట్‌ను వారాసిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి మేనమాతో వారికి గొడవలు ఉన్నట్లు అందులో ఉంది. మేనమామ రమేష్, బిట్ల రమేష్, ప్రకాశ్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News
Updated Date - Feb 02 , 2025 | 12:48 PM