ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kite: బాలున్ని బలిగొన్న గాలిపటం..

ABN, Publish Date - Jan 24 , 2025 | 08:34 AM

గాలిపటం ఎగురవేసే సరదా బాలుడిని బలిగొంది. మేడపైనుంచి గాలిపటం ఎగురవేస్తుండగా హెచ్‏టీ విద్యుత్‌వైర్లు తగిలి బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- పతంగి ఎగురవేయడానికి వెళ్లి విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాత

హైదరాబాద్: గాలిపటం ఎగురవేసే సరదా బాలుడిని బలిగొంది. మేడపైనుంచి గాలిపటం ఎగురవేస్తుండగా హెచ్‏టీ విద్యుత్‌వైర్లు తగిలి బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్‌(Rachakonda Commissionerate) పరిధిలోని నేరేడ్‌మెట్‌ పోలీస్‏స్టేషన్‌(Neredmet Police Station) పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Jeedimetla: చివరకు రోడ్డు రోలర్‌ను కూడా ఎత్తుకెళ్లారుగా..


కలకత్తాకు చెందిన హసీదుల్‌హక్‌ మాజీ సైనికోద్యోగి. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి మల్కాజిగిరి పరిధిలోని బలరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, పదేళ్ల కుమారుడు ఎస్‌కే అయాన్‌(SK Ayan) ఉన్నారు. అయాన్‌ 3వ తరగతి చదువుతున్నాడు. స్కూలు నుంచి వచ్చి పక్కనే ఉన్న ఓ అపార్టుమెంట్‌ పైకి ఎక్కి గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. అయితే, బిల్డింగ్‌కు అతిదగ్గర్లో ఉన్న విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్ల(High-tension electrical wires)కు గాలిపటం దారం చుట్టుకుంది.


దీంతో బలంగా గాలిపటాన్ని లాగే ప్రయత్నంలో విద్యుత్‌వైర్లు బాలునికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు గమనించి విషయాన్ని ఆయాన్‌ తండ్రికి తెలియజేయగా హుటాహుటిన వచ్చి అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని వెంటనే మిలట్రీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలుడు మరణించినట్లు ధ్రువీకరించారు. హసీదుల్‌హక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 08:34 AM