Share News

Jeedimetla: చివరకు రోడ్డు రోలర్‌ను కూడా ఎత్తుకెళ్లారుగా..

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:41 AM

సాధారణంగా బంగారం, నగలు, నగదు, సెల్‌ఫోన్‌, వాహనాలు చోరీలు చేయడం చూశాం. కానీ ఏకంగా రోడ్డు రోలర్‌ను ఎత్తుకెళ్లి మహారాష్ట్ర(Maharashtra)లో స్క్రాప్‌ దుకాణంలో విక్రయించారు. అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Jeedimetla: చివరకు రోడ్డు రోలర్‌ను కూడా ఎత్తుకెళ్లారుగా..

- అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురి అరెస్ట్‌

- రూ.30 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం

హైదరాబాద్: సాధారణంగా బంగారం, నగలు, నగదు, సెల్‌ఫోన్‌, వాహనాలు చోరీలు చేయడం చూశాం. కానీ ఏకంగా రోడ్డు రోలర్‌ను ఎత్తుకెళ్లి మహారాష్ట్ర(Maharashtra)లో స్క్రాప్‌ దుకాణంలో విక్రయించారు. అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 30 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం జీడిమెట్ల పోలీస్‏స్టేషన్‌(Jeedimetla Police Station)లో బాలానగర్‌ డీసీపీ కె. సురేష్‌ కుమార్‌, ఏసీపీ హన్మంతరావు కేసు వివరాలను వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మిమ్మల్ని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేయబోతున్నాం..


ఈనెల 20న బాలానగర్‌కు చెందిన బాలయ్య భార్య బి.లక్ష్మీ జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిధిలోని శివశక్తి టింబర్‌ డిపో వద్ద ఈ నెల 20వ తేదీ రాత్రి తమకు సంబంధించిన రోడ్డు రోలర్‌ను రోడ్డు పక్కన పెట్టి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వచ్చి చూడగా రోడ్డు రోలర్‌ కనిపించలేదు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. గతంలో పేట్‌బషీరాబాద్‌ ప్రాంతంలో ఇదే తరహా దొంగతనం చేసిన ముఠాపై నిఘా పెట్టాయి.


city3.2.jpg

బాలానగర్‌(Balanagar) ప్రాంతంలో ఉంటున్న కర్నాటక ప్రాంతానికి చెందిన అఫ్రోజ్‌ అహ్మాద్‌పటేల్‌)24, జహీరాబాద్‌(Zaheerabad)కు చెందిన మహ్మాద్‌ ఇబ్రహీం(31), సయ్యద్‌ ముస్తఫా, షేక్‌ అన్వర్‌(35), బల్లా రామసత్యనారాయణ(47)ను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారు. 20వ తేదీ రాత్రి డీసీఎం వాహనం, రెండు క్రేన్లను తీసుకొచ్చి రోడ్డు రోలర్‌ను ఎత్తుకెళ్లినట్టు తెలిపారు.


డీసీఎం వాహనం చెడిపోవడంతో అక్కడే వదిలేసి పోయామన్నారు. నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. సయ్యద్‌ ముస్తాఫా పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడానికి కృషిచేసిన వారికి రివార్డులు అందించారు. సమావేశంలో జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్‌, డీఐ కనకయ్య, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 07:43 AM