Share News

Hyderabad: మిమ్మల్ని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేయబోతున్నాం..

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:15 AM

గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేయబోతున్నామంటూ వృద్ధ దంపతులను బెదిరించి రూ. 8 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals). వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి, టెలికాం సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు.

Hyderabad: మిమ్మల్ని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేయబోతున్నాం..

- డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధ దంపతులకు బెదిరింపులు

- రూ. 8 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేయబోతున్నామంటూ వృద్ధ దంపతులను బెదిరించి రూ. 8 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals). వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి, టెలికాం సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. మీపై మనీ ల్యాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని, గంటల వ్యవధిలో మీ సిమ్‌ బ్లాక్‌ అవుతుందని చెప్పాడు. కేసులకు సంబంధించి సీబీఐ అధికారులతో మాట్లాడాలంటూ మరో నేరగాడికి కాల్‌ కలిపాడు.

ఈ వార్తను కూడా చదవండి: Talasani: సమయం ముగిసింది.. ఇక సమరమే


వీడియో కాల్‌లో మాట్లాడిన సైబర్‌ నేరగాడు(Cybercriminal) తాను సీబీఐ స్పెషల్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్‌ కార్డు వివరాలతో, ముంబయి అంధేరి వెస్ట్(Mumbai Andheri West)‏లోని కెనరా బ్యాంకులో ఖాతా ఉందని, ఈ ఖాతా ద్వారా విదేశాలకు రూ.60,060 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పాడు. అంతేకాకుండా ఇటీవల నమోదయిన మనీ లాండరింగ్‌ కేసుల వివరాలు, కేసులకు సంబంధించిన పత్రాలు చూపాడు. ఈ లావాదేవీల్లో మీ బ్యాంకు ఖాతా కీలకంగా ఉందని, గంటల వ్యవధిలో సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేస్తారని బెదిరించాడు. కేసు గురించి ఎవ్వరికీ ఫోన్‌ చేసి మాట్లాడొద్దన్నారు.


city2.2.jpg

కేసు నుంచి బయటపడాలంటే రూ. 8 లక్షలు తాను సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని సూచించాడు. భయపడిన వృద్ధదంపతులు వారు సూచించిన ఖాతాకు రూ. 8 లక్షలు బదిలీ చేశారు. తిరిగి మరుసటి రోజు తిరిగి డబ్బు డిమాండ్‌ చేయడంతో అనుమానం వచ్చిన బాధితులు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) దర్యాప్తు ప్రారంభించారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 07:15 AM