Police station: పోలీస్‌స్టేషన్ ముందే ఆత్మాహుతి
ABN, Publish Date - Jan 23 , 2025 | 11:20 AM
పోలీసుల వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగా, శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బుగ్గిపాలైపోయాడు. అతను పులియాంతోపు తిరువికనగర్ 7వ వీధికి చెందిన రాజన్ (42)గా గుర్తించారు.
- పోలీసుల బెదిరింపుతోనే బలి
- కుటుంబీకుల ఆరోపణ
చెన్నై: పోలీసుల వ్యవహారశైలితో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్(Police station) ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగా, శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బుగ్గిపాలైపోయాడు. అతను పులియాంతోపు తిరువికనగర్ 7వ వీధికి చెందిన రాజన్ (42)గా గుర్తించారు. ఆర్‌కే నగర్ పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. వివరాలిలా వున్నాయి...
ఈ వార్తను కూడా చదవండి: University: వర్సిటీలో అత్యాచారం కేసు.. రాత్రంతా నిందితుడి విచారణ
తిరువిక నగర్ 7వ వీధికి చెందిన రాజన్ కొరుక్కుపేట కరుమారియమ్మన్ నగర్‌లో స్టీల్ వర్క్‌షాప్ నడుపుతున్నాడు. రాజన్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో వర్క్‌షాప్ మూసివేసి, కొరుక్కుపేట అన్బళగన్ వీధిలోని మురుగన్‌కు చెందిన వర్క్ షాప్‌లో మూడు రోజుల క్రితం చేరాడు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాజన్‌కు, అదే వర్క్ షాప్‌లో పనిచేస్తున్న భారతి నగర్ హౌసింగ్ బోర్డుకు చెందిన మాధవన్ (46)కు మధ్య వాగ్వివాదం జరిగింది. వర్క్‌షాప్ యజమాని మురుగన్ జోక్యం చేసుకొని ఇద్దర్నీ సర్దిచెప్పి పంపించాడు.
ఈ ఘటనతో మనస్తాపం చెందిన రాజన్.. కొద్దిసేపటికి కొరుక్కుపేట అన్నానగర్ వేలన్ సత్రం సమీపంలోని టాస్మాక్ దుకాణానికి వెళ్లి మద్యం సేవించాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మాధవన్, రాజన్ మధ్య మళ్లీ వాగ్వివాదం జరిగింది. అక్కడకు మద్యం సేవించేందుకు వచ్చిన అరుణ్‌కుమార్(Arun Kumar) అనే వ్యక్తి, మాధవన్‌తో కలసి రాజన్‌పై దాడిచేసినట్లు సమాచారం. దీంతో సాయంత్రం 3.45 గంటల సమయంలో రాజన్ ఆర్కే నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తనపై దాడి చేసినవారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ సూచించినట్లు సమాచారం.
ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజన్ కోపంగా వెనుదిరిగాడు. రాత్రి 9.15 గంటల సమయంలో మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్ ముందు నిలబడి పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని అంటించుకున్నాడు. దీంతో మంటల్లోనే కాలిపోతున్న రాజన్‌ను గమనించిన పోలీసులు బక్కెట్లతో నీటిని తెచ్చి మంటలను చల్లార్చారు. కానీ అప్పటికే అతడి శరీరం 90 శాతం కాలిపోయింది. అనంతరం పోలీసులు అతడిని కీల్పాక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక అతను పొద్దుపోయాక మృతి చెందాడు. ఈ వ్యవహారంలో అరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, మాధవన్ కోసం గాలిస్తున్నారు. కాగా రాజన్ ఆత్మహత్యకు పోలీసుల వైఖరే కారణమంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News
Updated Date - Jan 23 , 2025 | 11:20 AM