Share News

University: వర్సిటీలో అత్యాచారం కేసు.. రాత్రంతా నిందితుడి విచారణ

ABN , Publish Date - Jan 22 , 2025 | 11:55 AM

అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌ను పోలీసులు సోమవారం రాత్రంతా విచారణ జరిపారు. రెండు రోజులకు ముందే పోలీసులు అతడిని కోర్టు ఉత్తర్వు ద్వారా ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

University: వర్సిటీలో అత్యాచారం కేసు.. రాత్రంతా నిందితుడి విచారణ

చెన్నై: అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌ను పోలీసులు సోమవారం రాత్రంతా విచారణ జరిపారు. రెండు రోజులకు ముందే పోలీసులు అతడిని కోర్టు ఉత్తర్వు ద్వారా ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న అతడిని ఎగ్మూరు పోలీసుస్టేషన్‌(Egmore Police Station)కు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఆ సందర్భంగా పోలీసులు అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో జ్ఞానశేఖరన్‌కు అన్నా విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాలు గురించి, ఏయే ప్రాంతాల్లో విద్యార్థినులు తమ బాయ్‌ఫ్రెండ్స్‌(Boyfriends)తో కబుర్లాడుకుంటారనే విషయాలు గురించి బాగా తెలుసునని వెల్లడైంది.

ఈ వార్తను కూడా చదవండి: Organ donation: మెదడు నిర్జీవమైన యువకుడి అవయవ దానం


nani4.jpg

అన్నా విశ్వవిద్యాలయం లోపల నుండి తప్పించుకునేందుకు వీలున్న ప్రాంతాలు కూడా అతడికి బాగా ఎరుకేనని పోలీసులు విచారణ ద్వారా తెలిసింది. జ్ఞానశేఖరన్‌ ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్న లాప్‌టా్‌పలలో ఉన్న అమ్మాయిల ఫొటోలను చూపెట్టి, వారితో అతడికున్న సంబంధాలు గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. ఈ విచారణ మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి అతడిని రహస్య ప్రాంతంలో విచారించారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 11:55 AM