Police station: పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం.. ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష
ABN, Publish Date - Feb 27 , 2025 | 12:44 PM
పోలీస్‌స్టేషన్(Police station)లో అత్యాచారం చేసిన కేసులో పదవీ విరమణ పొందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తలా 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
- ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష
చెన్నై: పోలీస్‌స్టేషన్(Police station)లో అత్యాచారం చేసిన కేసులో పదవీ విరమణ పొందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తలా 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దిండుగల్(Dindigal) జిల్లా సెంపట్టిలో 2001లో చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన మహిళను, ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారంటూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి(77), కానిస్టేబుళ్లు వీరదేవర్ (68), చిన్న దేవర్ (69)పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ బావిలో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, గ్రామస్తులు రక్షించారు.
ఈ వార్తను కూడా చదవండి: DMK: డీఎంకే శ్రేణుల అత్యుత్సాహం.. ఆంగ్ల అక్షరాలకు తారు పూత
కొద్దిరోజుల అనంతరం ఆమె భర్త శక్తివేల్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై తహసీల్దార్(Tahsildar) విచారణ చేపట్టి కోర్టులో నివేదిక దాఖలు చేశారు. కేసు విచారణ సుదీర్ఘంగా 24 ఏళ్లు సాగిన నేపథ్యంలో, ఇన్‌స్పెక్టర్ రంగస్వామి(Inspector Rangaswamy), కానిస్టేబుళ్లు వీరదేవర్, చిన్న దేవర్‌కు తలా 10 ఏళ్ల జైలుశిక్ష, రూ.36,000 జరిమానా విధిస్తూ దిండుగల్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి దీప మంగళవారం తీర్పు వెలువరించింది.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News
Updated Date - Feb 27 , 2025 | 12:44 PM