Hyderabad: రూ.14 వేలకు లక్ష...
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:07 PM
గుట్టుగా నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) పట్టుకున్నారు.
- నకిలీ నోట్ల చలామణి.. వ్యక్తి అరెస్ట్
- రూ.11.10 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ సిటీ: గుట్టుగా నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి రైల్వేస్టేషన్ బజార్‌ఘాట్‌లో నకిలీ కరెన్సీని మార్పిడి చేస్తున్నట్లు సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓవ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న రూ.11.10 లక్షల విలువైన నకిలీ నోట్లు (రూ.500 నోట్లు), ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన పబ్బతి మురళీకృష్ణ(Pabbati Muralikrishna)గా పోలీసులు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: ఇంటి అద్దె చెల్లించలేని దీనస్థితి.. తల్లి మృతదేహం చెంత కుమార్తెల కేసులో దర్యాప్తు ముమ్మరం
అతడు ఖమ్మం(Khammam) సమీపంలోని నాయుడుపేటలో పలు వ్యాపారాలు చేశాడు. ఎందులోనూ సక్సెస్ కాకపోవడంతో దొంగనోట్లు ముద్రించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. 2018 నుంచి ఖమ్మంలోనే నకిలీ నోట్లు ముద్రించి, వాటిని మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. రూ.14వేలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే వాటికి బదులుగా రూ. లక్ష నకిలీ నోట్లు ఇచ్చే విధంగా డీల్ కుదుర్చుకొని తన అనుచరుల ద్వారా దందా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నకిలీ నోట్లు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. కాగా, ఈ వ్యవహారంలో మురళీకృష్ణ పలుమార్లు జైలుకు వెళ్లాడు. నిందితుడిని నాంపల్లి పోలీసులకు అప్పగించగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News
Updated Date - Feb 02 , 2025 | 01:17 PM