Hyderabad: యాప్రాల్‌లో తల్లి.. లాలాగూడలో కూతురు.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:52 PM
యాప్రాల్‌లో తల్లి.. లాలాగూడలో కూతురు.. ఇలా తల్లీ కూతురు మృతిచెందిన విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. అయితే.. వీరిద్దరి మరణంపై పోలీ ులు విచారణ చేస్తున్నప్పటికీ వీరి మరణవ స్థానికంగా తీవ్ర సంచలనానికి దారితీసింది.
- ఒకే రోజు ఇద్దరి మృతి
- అరవింద్‌పై కుటుంబ సభ్యుల ఫిర్యాదు
- నగరంలో సంచలనంగా మారిన జంటహత్యలు
హైదరాబాద్: 80ఏళ్ల తల్లి యాప్రాల్‌లో... 45 ఏళ్ల కూతురు లాలాగూడలో ఒకేరోజు మృతి చెందారు. ఈసంఘటనలు నగరంలో సంచలనంగా మారాయి. రెండు హత్యలకూ ఒకే వ్యక్తి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానిస్తున్న వ్యక్తే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడా? అతడికి ఎవరైనా సహకరించారా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఈ వార్తను కూడా చదవండి: Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
లాలాగూడ, జవహార్‌నగర్ పోలీస్స్టేషన్ల(Lalaguda and Jawaharnagar police stations) పరిధిలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ యాప్రాల్ భరత్‌నగర్‌లో ఉడుగుల సుశీల (80)కు జ్ఞానేశ్వరి(45), లక్ష్మీ(40) ఉమామహేశ్వరి(35) ముగ్గురు కుమార్తెలు. కుమారుడు శివ కైలాష్ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. సుశీల 2018లో యాప్రాల్‌లోని కౌకుర్ భరత్‌నగర్‌లో ఇల్లు నిర్మించుకొని కూతురు ఉమమహేశ్వరి కోడలు స్రవంతితో కలిసి ఉంటున్నారు. ఇద్దరు కూతుర్లు జ్ఞానేశ్వరి, లక్ష్మీ మిర్జాలగూడలోని రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. సుశీల కుమార్తెలు ఎవరికీ వివాహం జరుగలేదు.
ఈ నెల 6న ఉదయం కూతురు, కోడలు కలిసి విధులకు వెళ్లారు. భరత్‌నగర్‌లోని ఇంట్లో సుశీల ఒంటరిగా ఉంది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వచ్చినట్టు చుట్టూ పక్కల వారు గమనించి కూతు రు ఉమామహేశ్వరికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె తల్లి సుశీలకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. ఇంటి పక్కనే ఉంటే వెంకటేష్ సారంగపాణికి ఫోన్ చేసి తమ తల్లిని చూడాలని కోరింది. ఇంట్లోకి వెళ్లి చూడగా సుశీల అప్పటికే మరణించినట్టు గుర్తించారు. ఉమామహేశ్వరి రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి సుశీల విగత జీవిగా కనిపించింది. వెంటనే ఉమామహేశ్వరి బంధువులకు తెలిపింది.
అరవింద్‌కుమార్ అలియాస్ అరుణ్ అనే వ్యక్తి బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి దూకి వెళ్లాడని చుట్టూపక్కల వారు చెప్పారు. అరవింద్‌కుమార్ అప్పుడ్పుడు సుశీల ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని, కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమ తల్లి సుశీలను అరవింద్‌కుమార్ అనే వ్యక్తి చంపి మూడున్నర తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడని, కుమార్తె ఉమామహేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
లాలాగూడలో కూతురు జ్ఞానేశ్వరి..
సుశీల కూతురు జ్ఞానేశ్వరి లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌లోని ఇంట్లోని నీటి సంపులో నిర్జీవంగా పడి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జ్ఞానేశ్వరి మానసిక స్థితి సరిగా ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. లక్ష్మితో సన్నిహితంగా ఉండే అరవింద్ తరచూ లాలాగూడ, భరత్‌నగర్‌లోని వారి ఇంటికి వచ్చే వాడని, వీరిద్దరు సన్నిహితంగా ఉండడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని సమాచారం. లాలాగూడలో లక్ష్మిని కలిసేందుకు అరవింద్ వస్తుండేవాడని, అక్కడ జ్ఞానేశ్వరి ఉండడం అతనికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వరి సంపులో నిర్జీవంగా పడి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అరవింద్ రెండు హత్యలు చేశాడా..? ఇతరత్రా కారణాలున్నాయా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి:
తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 08 , 2025 | 01:52 PM