Viral News: 18 ఏళ్లు నిండొద్దని.. బర్త్ డేకు ముందే కుమారుడిని చంపిన తల్లి
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:12 PM
ఓ తల్లి తన కుమారుడికి 18 ఏళ్లు నిండకూడదని అతని పుట్టినరోజుకు ముందే హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏ తల్లి అయినా కూడా కుమారుల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంది. పిల్లాడు పుట్టినప్పటి నుంచి మొదలుకుని, పెరిగి పెద్దయ్యే వరకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఓ తల్లి మాత్రం అనూహ్యంగా తన కుమారుడిని హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది. ఎందుకు ఆమె తన కుమారుడిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికా(america )లోని మిచిగాన్ (michigan) రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల కేటీ లీ అనే తల్లి, తన 17 ఏళ్ల కొడుకు ఆస్టిన్ డీన్ పికార్ట్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కత్తి వదలకపోవడంతో..
ఈ ఘటన ఫిబ్రవరి 21న హాలండ్‌లోని ఆమె నివాసంలో జరిగింది. అదే రోజు ఉదయం పోలీసుల నంబర్ 911కు కాల్ చేసి, తన కొడుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని కేటీ తెలిపింది. ఆ క్రమంలో తన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మాత్రం, కేటీ కత్తి పట్టుకుని ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ తర్వాత ఇంటి లోపల, ఆస్టిన్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది. కత్తిని వదలకపోవడంతో ఆమెను కొట్టి మరి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
సూసైడ్ అటెమ్ట్..
కోర్టు రికార్డుల ప్రకారం కేటీ తన కొడుకును 18వ పుట్టినరోజుకు ముందే చంపాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక డిటెక్టివ్.. కోర్టు విచారణలో వెల్లడించారు. కేటీ తన కొడుకుకు 18 ఏళ్లు నిండకూడదని భావించినందున, అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెట్టేలా చేసిందని పేర్కొన్నారు. అందుకోసం ఇద్దరు అధిక మోతాదులో మందులు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆస్టిన్ స్పృహ కోల్పోయినప్పుడు, కేటీ అతని గొంతు, చేతులను కత్తితో కోసినట్లుగా వెలుగులోకి వచ్చింది.
మళ్లీ కోర్టుకు..
ఇక ఆస్టిన్ విషయానికి వస్తే అతను చాలా యాక్టివ్‌గా ఉంటాడని, పిల్లులు, పుస్తకాలు, తన తండ్రితో చేపలు పట్టడం, వీడియో గేమ్‌లను ఆడేందుకు ఇష్టపడతాడని స్థానికులు చెబుతున్నారు. కేటీ లీ ప్రస్తుతం బహిరంగ హత్య, అరెస్టును ప్రతిఘటించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది. ఆమె ప్రస్తుతం విడుదలయ్యారు. ఆమె మళ్లీ మార్చి 4న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఓ తల్లి తన కొడుకును చంపిన విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె మానసిక, ఆరోగ్య సమస్యలతోపాటు కుటుంబ ఒత్తిడి, సమాజంలో ఏదైనా కారణాలు ఆమెను ప్రేరేపించాయా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని పలువురు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ. 108కే మంత్లీ రీఛార్జ్.. డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 27 , 2025 | 06:44 PM