ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gurugram Tennis Player: టెన్నిస్ ప్లేయర్ హత్య.. ఆ మ్యూజిక్ వీడియోనే కారణం..

ABN, Publish Date - Jul 11 , 2025 | 11:12 AM

Gurugram Tennis Player: కన్నతండ్రే ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. గురువారం గురుగావ్‌లోని స్వగృహంలో ఆమెను చంపేశాడు. పోలీసులు రాధిక తండ్రి దీపక్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Gurugram Tennis Player

జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కన్నతండ్రే ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. గురువారం గురుగావ్‌లోని స్వగృహంలో ఆమెను చంపేశాడు. పోలీసులు రాధిక తండ్రి దీపక్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో దీపక్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. పోలీసుల సమాచారం ప్రకారం దీపక్ ఏం చెప్పాడంటే.. ‘మా సొంతూరు వజీరాబాద్. మా ఊరి వాళ్లు రాధిక విషయంలో నన్ను వేధిస్తున్నారు. ఇష్టం వచ్చిన మాటలు అనే వాళ్లు.

‘కూతురు సంపాదిస్తుంటే.. తిని కూర్చుంటున్నావ్’ అని ఎగతాళి చేసేవాళ్లు. రాధికను టెన్నిస్ అకాడమీ మూసివేయమని అడిగాను. తను ఒప్పుకోలేదు. ఆర్థిక స్వాతంత్ర్యం కావాలనేది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేసేది. కొన్ని నెలల క్రితం ఓ మ్యూజిక్ వీడియో కూడా చేసింది. నాకు అది నచ్చలేదు. అందుకే చంపేశా’ అని చెప్పాడు. కాగా, గురువారం ఉదయం 10.30 గంటలకు రాధిక వంట గదిలో వంట చేస్తోంది. దీపక్ చప్పుడు కాకుండా వంట గదిలోకి వెళ్లాడు. రాధిక వీపుపై మూడు సార్లు కాల్పులు జరిపాడు.

రాధిక చిన్నాన్న కుల్దీప్ యాదవ్ అదే బిల్డింగ్‌లో కింది అంతస్తులో ఉంటున్నాడు. తుపాకి పేలిన శబ్ధం రావటంతో ఆయన పైకి పరుగున వెళ్లాడు. వంట గదిలో రాధిక రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను కారులో ‘ఏషియా మారింగో హాస్పిటల్‌’కు తీసుకెళ్లాడు. రాధికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు తేల్చారు. కుల్దీప్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాధిక హత్యకు ఆమె మ్యూజిక్ వీడియో చేయటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం.

Updated Date - Jul 11 , 2025 | 11:58 AM