Secunderabad: సికింద్రాబాద్‌లో గంజాయి చాక్లెట్ల పట్టివేత..
ABN, Publish Date - Jan 31 , 2025 | 10:13 AM
రాజస్థాన్ నుంచి కూకట్‌పల్లి(Kukatpally)కి గంజాయి చాకెట్లను సరఫరా చేస్తుండగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు భారీగా 24 కిలోల గంజాయి చాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్: రాజస్థాన్ నుంచి కూకట్‌పల్లి(Kukatpally)కి గంజాయి చాకెట్లను సరఫరా చేస్తుండగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు భారీగా 24 కిలోల గంజాయి చాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన గోరక్ సహా రాజస్థాన్ నుంచి గురువారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగాడు. అంతలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(Enforcement officers) చాకచక్యంగా గోరక్‌ను పట్టుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Commissioner: గ్రేటర్‌లో స్మార్ట్ బిన్‌లు: ఇలంబరిది
అతడి వద్ద రూ.2లక్షల విలువ చేసే 24 కిలోల గంజాయి చాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలో టీకొట్టు దగ్గర గంజాయి చాకెట్లను అమ్ముతున్నట్లు ఒక్కొక్క చాక్లెట్ రూ 40కి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు 120 గంజాయి చాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు(Secunderabad Excise Police) అప్పగించామని అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 31 , 2025 | 10:13 AM