Commissioner: గ్రేటర్‌లో స్మార్ట్ బిన్‌లు: ఇలంబరిది
ABN , Publish Date - Jan 31 , 2025 | 09:42 AM
గ్రేటర్(Greater)లో రోడ్లపై చెత్త కుప్పలు కనిపించకుండా మరో ప్రయోగానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా పలు సర్కిళ్లలో స్మార్ట్ బిన్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఇలంబరిది(Commissioner Ilambaridi) తెలిపారు.

హైదరాబాద్ సిటీ: గ్రేటర్(Greater)లో రోడ్లపై చెత్త కుప్పలు కనిపించకుండా మరో ప్రయోగానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా పలు సర్కిళ్లలో స్మార్ట్ బిన్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఇలంబరిది(Commissioner Ilambaridi) తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ (జీవీపీ)తొలగించే అవకాశం లేనిచోట వీటిని అందుబాటులో ఉంచనున్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో ప్రస్తుతం 800లకుపైగా జీవీపీలు ఉన్నాయి. పలుమార్లు ప్రయత్నం చేసినా.. ఆ ఏరియాల్లో జీవీపీల తొలగింపు సాధ్యపడడం లేదని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల బిన్‌లు ఉన్నా.. అవి నిండిపోవడంతో పక్కన చెత్త వేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గజం @ రూ. 1.90 లక్షలు..
కొందరు ఇష్టారాజ్యంగా విసిరేస్తున్నారు. దీంతో రహదారులు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు స్మార్ట్ బిన్‌లు(Smart bins) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెన్సార్ ఉండే బిన్‌లలో చెత్త ఎంతమేర ఉందన్నది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. 25 శాతం, 50 శాతం బిన్‌లు నిండినప్పుడు సెంట్రల్ సిస్టమ్‌కు అలర్ట్ వస్తుంది. దాని ఆధారంగా ఆ మార్గంలోని జీహెచ్‌ఎంసీ వాహనాలు వెంటనే బిన్‌లను తొలగిస్తాయి. లండన్, సింగపూర్ వంటి నగరాల్లో ఈ తరహా బిన్‌లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News