Hyderabad: ఏఐ ఆధారిత సెక్స్ రాకెట్.. గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం
ABN, Publish Date - Jan 30 , 2025 | 08:17 AM
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్‌లు(Instagram and Telegram apps), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విటులను ఆకర్షిస్తూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. 11మందిని అదుపులోకి తీసుకున్నారు.
- ఇద్దరు విటులు, 9మంది మహిళల అరెస్ట్
హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్‌లు(Instagram and Telegram apps), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విటులను ఆకర్షిస్తూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సెల్‌ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి(Gachibowli) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కెన్యా దేశానికి చెందిన ఐదుగురు, టాంజానియా, ఉగాండా దేశాలకు చెందిన నలుగురు, మొత్తం 9మంది విదేశీ మహిళలతో నిర్వాహకులు గౌలిదొడ్డి టీఎన్జీఓ కాలనీ(Gaulidoddi TNGO Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండుపోర్షన్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గుండెపోటుతో యువ కానిస్టేబుల్ మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు విటులతో పాటు 9మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొన్ని నెలలుగా ఈ దందాకు తెరలేపిన ముఠా వివిధ దేశాలతో సెక్స్ రాకెట్ నెట్‌వర్క్ కలిగివున్నట్లు గుర్తించారు. పోలీసుల దాడుల్లో నిర్వాహకులు పట్టుబడకపోవడం గమనార్హం.
ఆన్‌లైన్‌లో వల..
ఎంపిర్ ఎస్మార్ట్ పేరుతో సోషల్ మీడియాలో విదేశీ యువతులతో గాలం వేస్తున్నారు. ఎవరైనా ఆకర్షితులైతే యాప్‌కు లింకును పంపిస్తారు. ఆ లింకు ఓపెన్ చేసి యాక్సెస్ రిక్వెస్ట్ నొక్కిన వెంటనే ఫోన్ నంబర్, వాట్సాప్ యాక్సెస్ చూపిస్తుంది. వాట్సాప్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిగా ఫోన్లో గ్రూప్ క్రియేట్ అయి అందులో యువతులకు సంబంధించిన ఫొటోలు ఆశ్లీల వివరాలు పంపిస్తారు. వారు చెప్పే చిరునామాకు చేరుకోగానే అప్పటి వరకు చాట్ చేసిన వివరాలు యాప్‌లు ఫోన్ నుంచి మాయమవుతాయి. ఏఐ ఆధారిత టెక్నాలజీ ద్వారా పకబ్బందీగా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 30 , 2025 | 08:17 AM