Wipro PCB Manufacturing: పీసీబీల తయారీకి ప్రత్యేక విభాగం విప్రో
ABN, Publish Date - Jul 29 , 2025 | 06:03 AM
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) తయారీకి అవసరమైన అధిక సామర్థ్యం గల బేస్ మెటీరియల్స్ తయారీకి కొత్త డివిజన్‌ను ప్రారంభించినట్టు విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ (విన్) ప్రకటించింది...
న్యూఢిల్లీ: ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) తయారీకి అవసరమైన అధిక సామర్థ్యం గల బేస్ మెటీరియల్స్ తయారీకి కొత్త డివిజన్‌ను ప్రారంభించినట్టు విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ (విన్) ప్రకటించింది. విప్రో ఎలక్ర్టానిక్ మెటీరియల్స్‌గా వ్యవహరించే ఈ కొత్త వ్యాపార విభాగం కింద కర్ణాటకలో రూ.500 కోట్ల పెట్టుబడితో కాపర్ క్లాడ్ లామినేట్ (సీసీఎల్) తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 60 లక్షల సీసీఎల్ పరికరాలని తెలిపింది. దేశంలోని ఎలక్ర్టానిక్స్ తయారీ విభాగంలో ఈ తరహాలో తొలి పెట్టుబడి ఇదేనని కంపెనీ సీఈఓ ప్రతీక్ కుమార్ చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న టెలికాం, ఆటోమోటివ్ ఎలక్ర్టానిక్స్, కన్స్యూమర్ డివై్‌సలు, ఇండస్ట్రియల్ సిస్టమ్స్, ఏఐ మౌలిక వసతుల అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 29 , 2025 | 06:15 AM