ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విప్రో ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌కు ఫ్రెంచ్‌ కంపెనీలో మెజారిటీ వాటా

ABN, Publish Date - Jun 19 , 2025 | 05:28 AM

ఫ్రాన్స్‌కు చెందిన విమానాల విడిభాగాల తయారీదారు లౌక్‌ గ్రూప్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఇంజనీరింగ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌ (డబ్ల్యూఐఎన్‌)...

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన విమానాల విడిభాగాల తయారీదారు లౌక్‌ గ్రూప్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఇంజనీరింగ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌ (డబ్ల్యూఐఎన్‌) బుధవారం తెలిపింది. ప్రస్తుతం ప్యారి్‌సలో జరుగుతున్న ఎయిర్‌షోలో ఇరువర్గాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయి తే, ఎంత వాటా, ఎంతకు కొనుగోలు చేస్తున్న వివరాలను మాత్రం డబ్ల్యూఐఎన్‌ వెల్లడించలేదు. మరికొద్ది నెలల్లో ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి కావచ్చని అంచనా. ఈ డీల్‌ పూర్తయ్యాక కంపెనీ పేరును విప్రో లౌక్‌గా మార్చనున్నారు. 50 ఏళ్ల నాటి కుటుంబ యాజమాన్య సంస్థ అయిన లౌక్‌ గ్రూప్‌.. పలు అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కంపెనీలకు విమానాల విడిభాగాలను సరఫరా చేస్తోంది.

ప్యారిస్‌ ఎయిర్‌ షోలో రఘు వంశీ

హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ ఏరోస్పేస్‌ గ్రూప్‌ ప్రస్తుతం పారి్‌సలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్‌ షోలో తన ఆధునిక ఢిఫెన్స్‌ అండ్‌ ప్రొపల్షన్‌ టెక్నాలజీలను ప్రదర్శించింది. దేశీయంగా తయారు చేసిన మైక్రో టర్బోజెట్‌ ఇంజన్ల నుంచి హై పెర్‌ఫార్మెన్స్‌ కామికేజ్‌ డ్రోన్లను ప్రదర్శనలో ఉంచినట్లు కంపెనీ తెలిపింది.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 05:28 AM