ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డీరేటు మరింత తగ్గేనా

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:29 AM

దేశంలో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ...

రేపే ఆర్‌బీఐ పాలసీ

న్యూఢిల్లీ: దేశంలో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం, శుక్రవారం దీనిపై నిర్ణయం ప్రకటించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన సమావేశాల్లో ఎంపీసీ కీలక ‘రెపోరేటును పావు శాతం చొప్పున అర శాతం మేర తగ్గించింది. మరోవైపు ట్రంప్‌ సుంకాల పోటు నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమవుతుందా..లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 3.16 శాతానికి దిగివచ్చింది.

ఎంత తగ్గొచ్చు: ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ఆర్థిక, ద్రవ్య సమీక్షలో ఎంపీసీ రెపో రేటును ప్రస్తుత ఆరు శాతం నుంచి మరో పావు శాతం లేదా అర శాతం కుదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఒకే విడతగా ఉంటుందా, లేక రెండు విడతలుగా ఉంటుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 04:29 AM