‘బేర్’మంటున్న డాలర్
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:23 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో అమెరికా కరెన్సీ డాలర్ కూడా ‘బేర్’మంటోంది. కీలకమైన ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు ఇప్పటికే మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది...
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో అమెరికా కరెన్సీ డాలర్ కూడా ‘బేర్’మంటోంది. కీలకమైన ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు ఇప్పటికే మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జనవరి 15 నుంచి ఇప్పటి వరకు చూసినా ఈ కరెన్సీలతో డాలర్ మారకం రేటు 9 శాతం నష్టపోయింది. ఇక ఈ నెల ప్రారంభం నుంచి చూసినా యూరో, బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్‌లతో డాలర్ మారకం రేటు 5 నుంచి 6 శాతం పడిపోయింది. ట్రంప్ దుందుడుకు ఆర్థిక విధానాలతో డాలర్ మారకం రేటు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
డాలర్ ఆధిపత్యానికి గండి: డాలర్ మారకం రేటు పడిపోవడం అమెరికా ఆర్థికవేత్తలను కలవరపరుస్తోంది. ఈ పతనానికి వెంటనే తెరపడకపోతే ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ తన స్థానా న్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్‌దే అగ్రస్థానం. డాలర్ మారకం రేటు మరింత క్షీణిస్తే ఆ ఆధిపత్యానికీ తెరపడినట్టే.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 19 , 2025 | 04:23 AM