ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPI: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు రద్దు.. కారణమిదే..

ABN, Publish Date - Jan 29 , 2025 | 11:21 AM

ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. పలు రకాల ఐడీల పేరుతో ఉన్న వాటిని తిరస్కరించనున్నట్లు ఇప్పటికే యూపీఐ తెలిపింది. అయితే ఎలాంటివి తిరస్కరిస్తారు, ఎంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

UPI Reject Transactions

వచ్చే నెల 1 నుంచి యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు తరచుగా చేసే వివిధ చెల్లింపుల విధానాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మార్చేసింది. ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అక్షరాలు ఉన్న అన్ని లావాదేవీలను తిరస్కరించనున్నట్లు తెలిపింది. పేమెంట్ ఎంచుకున్నప్పుడు ప్రత్యేక అక్షరాలు (ఆల్ఫాన్యూమరిక్ కాకుండా) ఉన్న లావాదేవీ IDలు ఇకపై అమల్లో ఉండవు. అంటే మీరు చెల్లింపులు చేసినప్పుడు UPI యాప్ లావాదేవీ ID ఆల్ఫాన్యూమరిక్ రూపంలో ఉన్న వాటిలో ప్రత్యేక అక్షరాలు ఉంటే అవి తిరస్కరించబడతాయి.


ఇవి మాత్రమే

గత జనవరి 9న జారీ చేసిన సర్క్యూలర్‌లో NPCI, UPI సాంకేతిక వివరణలను అనుసరించి, UPI లావాదేవీ IDలు సరైన రూపంలో ఉండాలని సూచించింది. ఇందులో కీలకంగా IDలు కేవలం ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో మాత్రమే ఉండాలని నిర్ణయించబడింది. UPI చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు ఈ మార్పు ప్రకారం, IDలు అవసరమైన ఫార్మాట్‌లో ఉంచుకోవాలని సూచించారు. ఈ మార్పులన్నీ పూర్వం యూపీఐ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉండటానికి, సాంకేతికంగా సరైనదిగా ఉండేలా మార్పు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక అక్షరాలు, పంక్షుయేషన్లు లేదా ఇతర ఎక్స్‌ట్రా అక్షరాలు కలిగిన IDలను ఇకపై UPI లావాదేవీలలో అనుమతించరు. దీంతో పేమెంట్ ప్రాసెసింగ్ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుందని చెబుతున్నారు.


డేటా ప్రకారం చూస్తే..

UPI లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలలో భారీగా పెరిగాయి. 2016లో నోట్ల రద్దు తర్వాత, UPI ద్వారా చెల్లింపులు వేగంగా పెరిగాయి. తాజా డేటా ప్రకారం డిసెంబర్ 2024లో UPI లావాదేవీలు రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లను చేరుకున్నాయి. ఇది నవంబర్ నెల కంటే ఎనిమిది శాతం ఎక్కువగా ఉంది. ఇదే విధంగా డిసెంబర్ నెలలో విలువ పరంగా రూ. 23.25 లక్షల కోట్ల వరకు లావాదేవీలు నమోదయ్యాయి. ఇది నవంబర్‌లో రూ. 21.55 లక్షల కోట్లు కంటే అధికం కావడం విశేషం. UPI ద్వారా జరిగే చెల్లింపుల పెరుగుదల అనేది దేశంలోని డిజిటల్ పేమెంట్స్‌లో మంచి మార్పును సూచిస్తుంది. చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ వ్యాపారాల కోసం UPIని ఎక్కువగా ఉపయోగించటంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.


డిపాజిట్ స్కామ్..

అయితే ఇటివల యూపీఐ వినియోగం పెరిగిన క్రమంలో మోసాలు కూడా పెరిగాయి. పలువురు కేటుగాళ్లు వినియోగదారులకు చిన్న చెల్లింపులు చేసి, ఆ తరువాత పెద్ద మొత్తాలు లూటీ చేస్తున్నట్లు వేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి అనేక మోసాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల NPCI జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం అన్ని UPI వ్యవస్థ భాగస్వామ్య సంస్థలు ఈ మార్పులను గమనించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించబడ్డాయి. UPI లేదా బ్యాంక్ అప్లికేషన్‌ను తెరిచినప్పటికీ, లావాదేవీ స్వయంచాలకంగా ఆమోదించబడదు. వినియోగదారులు తమ UPI పిన్‌ను నమోదు చేయడం ద్వారా మాత్రమే చెల్లింపు అభ్యర్థనకు ఆమోదం లభిస్తుంది.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 11:21 AM