ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నవంబరు నుంచి ట్రూజెట్‌ టేకాఫ్‌

ABN, Publish Date - Jun 13 , 2025 | 05:00 AM

ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ (గతంలో టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) టేకా్‌ఫకు సిద్ధమవుతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఇందుకోసం ఇప్పటికే అనుమతి సంపాదించింది....

విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు

న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ (గతంలో టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) టేకా్‌ఫకు సిద్ధమవుతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఇందుకోసం ఇప్పటికే అనుమతి సంపాదించింది. 2015-22 మధ్య కాలంలో ప్రాంతీయ విమానయాన సంస్థగా ట్రూజెట్‌ దేశంలో విమాన సర్వీసులు నిర్వహించింది. అయితే కొవిడ్‌తో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2022 ఫిబ్రవరిలో కార్యకలాపాలు నిలిపివేసింది. విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) నుంచి ఎయిర్‌ ఆపరేటర్స్‌ అనుమతి (ఏఓపీ) కోసం ట్రూజెట్‌ దరఖాస్తు చేసింది. ఈ అనుమతి లభిస్తే ఈ ఏడాది నవంబరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రం గా తన సర్వీసులు ప్రారంభించాలని ట్రూజెట్‌ యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో ట్రూజెట్‌.. హైదరాబాద్‌ కేంద్రం గా కార్యకలాపాలు సాగించింది.

రూ.200 కోట్ల పెట్టుబడి: విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ట్రూజెట్‌ యాజమాన్యం రూ.200 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించినట్టు సమాచారం. తొలుత ఒక ఎయిర్‌బస్‌ ఏ320 విమానంతో విమాన సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఏటీఆర్‌ రకం విమానాలు సమకూర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..

ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:00 AM