IT boom: ఐటీ కొలువుల్లో చిన్న నగరాల హవా
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:38 AM
ఐటీ కొలువుల నియామకాల వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తెలంగాణలోని వరంగల్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. మెట్రో నగరాలను మించిపోతున్నాయి...
జాబితాలో విశాఖపట్నం, వరంగల్.. 50 శాతానికి పైగా వృద్ధి: టీమ్‌లీజ్
న్యూఢిల్లీ: ఐటీ కొలువుల నియామకాల వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తెలంగాణలోని వరంగల్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. మెట్రో నగరాలను మించిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో ఈ నగరాల్లో ఐటీ నియామకాలు, గత ఏడాది ఇదే కాలం తో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఐటీ కొలువుల నియామకాల వృద్ధి రేటు 12 నుంచి 15 శాతం మించలేదు. కంపెనీలకు నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ డిజిటల్ సంస్థ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ప్రధాన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు అన్నిటిలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోందని ఆ సంస్థ పేర్కొంది.
ఇతర ప్రధానాంశాలు
కొవిడ్ తర్వాత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ఐటీ కంపెనీల దృష్టి
కోయంబత్తూరు, నాగ్‌పూర్, నాసిక్ నగరాల్లో 20-25 శాతం పెరిగిన నియామకాలు
ఇండోర్, జైపూర్‌లలో 30 నుంచి 40 శాతం పెరిగిన ఐటీ నియామకాలు
సహాయ ఉద్యోగుల నియామకాలు ప్రధాన నగరాల్లో 8-15%పెరిగితే.. చిన్న నగరాల్లో 24-31ు పెరుగుదల
మైసూరులో జెనరేటివ్ ఏఐతో సహా డిజిటల్ టెక్నాలజీల నియామకాలు 32 శాతం అప్
ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఐటీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల రాకతో పుంజుకున్న చిన్న నగరాలు.
ప్రధాన నగరాల్లో స్టార్ట్‌పల పోటీని తట్టుకోలేక చిన్న నగరాల బాట పట్టిన ఐటీ కంపెనీలు.
ఫుల్ స్టాక్ డెవలపర్లు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు, క్లౌడ్ స్పెషలిస్టులకు మంచి డిమాండ్
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 15 , 2025 | 05:38 AM