ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tech Mahindra: టెక్‌ మహీంద్రా లాభం రూ.1,140 కోట్లు

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:44 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం రూ.1,140.60 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి ఆర్జించిన...

క్యూ1లో 34 శాతం వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం రూ.1,140.60 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.851.5 కోట్ల లాభంతో పోలిస్తే దాదాపు 34 శాతం వృద్ధి కనబరిచింది. కమ్యూనికేషన్స్‌, రిటైల్‌, బీఎ్‌ఫఎస్‌ఐ విభాగాలు మెరుగైన వృద్ధి సాధించడం ఇందుకు దోహదపడింది. ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 2.7 శాతం వృద్ధి చెంది రూ.13,351.2 కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ లాభం 2.2 శాతం, ఆదాయం 0.2 శాతం తగ్గింది. ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న అస్థిర వాతావరణంలో కంపెనీ ప్రణాళికలకు అనుగుణమైన పురోగతిని జూన్‌ త్రైమాసిక పనితీరు ప్రతిబింబిస్తోందని టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ మోహిత్‌ జోషి అన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు..

  • గడిచిన మూడు నెలల్లో 80.9 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది.

  • ఈ క్యూ1లో బీఎ్‌ఫఎ్‌సఐ విభాగం నుంచి ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 4.7 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్‌, లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ 3.8 శాతం, కమ్యూనికేషన్స్‌ 2.5 శాతం వృద్ధి చెందాయి. మాన్యుఫాక్చరింగ్‌ విభాగ రెవెన్యూ మాత్రం 4 శాతం తగ్గగా.. టెక్నాలజీ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రెవెన్యూ 3.3 శాతం తగ్గింది.

  • ప్రాంతాల వారీగా చూస్తే, యూరప్‌ మార్కెట్‌ నుంచి ఆదాయం 11.7 శాతం పెరగగా.. అమెరికా నుంచి రెవెన్యూ 5.9 శాతం తగ్గింది.

  • ఈ జూన్‌ 30 నాటికి టెక్‌ మహీంద్రాలో మొత్తం 1,48,517 మంది పనిచేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ఉద్యోగులు నికరంగా 897 మంది పెరిగారు. ఐటీ విభాగ సిబ్బంది సంఖ్య మాత్రం 622 తగ్గుదలతో 79,987గా నమోదైంది. ఐటీ విభాగంలో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 12.6 శాతానికి పెరిగింది.

  • బుధవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 1.94 శాతం పెరిగి రూ.1,609 వద్ద ముగిసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2025 | 05:44 AM