ప్రపంచ టాప్ 50 బ్రాండ్లలో టీసీఎస్
ABN, Publish Date - May 16 , 2025 | 04:53 AM
దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్).. ప్రపంచంలోని అత్యంత విలువైన 50 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. 5,730 కోట్ల డాలర్ల (దాదాపు రూ.4.90 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో...
రూ.4.90 లక్షల కోట్లకు కంపెనీ బ్రాండ్ విలువ
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫీకీ చోటు
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్).. ప్రపంచంలోని అత్యంత విలువైన 50 కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. 5,730 కోట్ల డాలర్ల (దాదాపు రూ.4.90 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో 45వ స్థానాన్ని దక్కించుకుంది. బ్రాండ్ల విలువను మదించే లండన్ కంపెనీ కాంటార్.. ఈ ఏడాదికి గాను ప్రపంచంలోని టాప్-100 బ్రాండ్ల జాబితాను గురువారం విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే టీసీఎస్ బ్రాండ్ విలువ 28 శాతం పెరిగిందని కాంటార్ తెలిపింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ సైతం చోటు సాధించాయి. 4,495 కోట్ల డాలర్ల (రూ.3.84 లక్షల కోట్లు) బ్రాండ్ వాల్యూతో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 56వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్ 3,709 కోట్ల డాలర్ల (రూ.3.17 లక్షల కోట్లు) విలువతో 66వ స్థానంలో ఉంది. 3,309 కోట్ల డాలర్ల (రూ.2.83 లక్షల కోట్లు) బ్రాండ్ విలువ తో ఇన్ఫోసిస్ 73వ స్థానంలో నిలిచింది.
వరల్డ్ నం.1 బ్రాండ్ యాపిల్
ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. కాంటార్ నివేదిక ప్రకారం.. యాపిల్ బ్రాండ్ విలువ 1.3 లక్షల కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో రూ.1.11 కోట్ల కోట్లు. గుగూల్ (94,413.7 కోట్ల డాలర్లు), మైక్రోసాఫ్ట్ (94,413 కోట్ల డాలర్లు) వరుసగా 2, 3వ అత్యంత విలువైన బ్రాండ్లుగా నిలిచాయి. అమెజాన్, ఎన్‌విడియా 4, 5వ స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2025 | 11:11 PM