ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tax Benefits for Health Insurance: అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ABN, Publish Date - Jul 13 , 2025 | 03:15 AM

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా...

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.

80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.

  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు...నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ఇవీ చదవండి:

చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:15 AM