ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సన్‌రైజర్స్‌తో సీయూబీ జట్టు

ABN, Publish Date - Mar 16 , 2025 | 04:53 AM

ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ).. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు ప్రత్యేక బ్యాంకింగ్‌ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు...

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ).. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు ప్రత్యేక బ్యాంకింగ్‌ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు, క్రికెటర్లు, సిబ్బంది కోసం కస్టమైజ్డ్‌ సేవలతో పాటు ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు సీయూబీ చైర్మన్‌ మహాలింగం, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆనంద్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానుల కోసం ప్రత్యేక పొదుపు ఖాతాలు, రుణాలు, కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు విజయ్‌ చెప్పారు. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌కు చెందిన జెర్సీలు, క్యాప్స్‌, ఇతర వస్తువుల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లతో పాటు డిజిటల్‌ బ్యాకింగ్‌ సేవలను అందించనున్నట్లు తెలిపారు.


ఎస్‌ఆర్‌హెచ్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల కోసం రూపే, మాస్టర్‌ కార్డ్‌తో జట్టు కట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా తొలిసారిగా రూపే వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మొత్తం నాలుగు రకాల క్రెడిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విజయ్‌ వెల్లడించారు. ప్రస్తుతం సీయూబీ దేశవ్యాప్తంగా 840 శాఖలను నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 90 శాఖలను కలిగి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..

Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 04:53 AM