మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN, Publish Date - Jun 11 , 2025 | 03:12 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. మదుపరులు బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రామాణిక సూచీలు...
నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. మదుపరులు బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రామాణిక సూచీలు మిశ్రమంగా ముగిశాయి. మంగళవారం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. ఉదయంసెషన్‌లో 235 పాయింట్ల వరకు ఎగబాకింది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలపై ఒత్తిడి పెరిగింది. ఒక దశలో 205 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్.. ఐటీ షేర్లలో కొనుగోళ్లతో చివరికి 53.49 పాయింట్ల నష్టంతో 82,391.72 వద్ద ముగిసింది. నిఫ్టీ మా త్రం ఒక పాయింటు పెరిగి 25,104.25 వద్ద స్థిరపడింది.
13నెలల కనిష్ఠానికి ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు
గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు 13 నెలల కనిష్ఠ స్థాయి రూ.19,013 కోట్లకు తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం.. ఈక్విటీ ఫండ్లలోకి నిధులు తగ్గడం వరుసగా ఇది ఐదో నెల. అంతేకాదు, ఈ ఏప్రిల్‌లో వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే గత నెలలో 22 శాతం తగ్గుదల నమోదైంది.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2025 | 03:12 AM