ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shailesh Jejurikar: పీ అండ్‌ జీ పగ్గాలు భారతీయుడి చేతికి

ABN, Publish Date - Jul 30 , 2025 | 05:15 AM

మరో ప్రముఖ బహుళజాతి కంపెనీకి భారతీయుడు సారథ్యం వహించనున్నారు. అమెరికన్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్‌ (పీ అండ్‌ జీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా శైలేష్‌ జెజురికర్‌...

కొత్త సీఈఓగా శైలేష్‌ జెజురికర్‌

2026 జనవరి 1 నుంచి బాధ్యతలు

న్యూఢిల్లీ: మరో ప్రముఖ బహుళజాతి కంపెనీకి భారతీయుడు సారథ్యం వహించనున్నారు. అమెరికన్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్‌ (పీ అండ్‌ జీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా శైలేష్‌ జెజురికర్‌ నియమితులయ్యారు. 58 ఏళ్ల జెజురికర్‌ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. 1989లో ఈ కంపెనీలో అసిస్టెంట్‌ బ్రాండ్‌ మేనేజర్‌గా చేరిన శైలేష్‌.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గత ఆరేళ్లుగా కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ లిఫ్ట్‌ల తయారీ సంస్థ ఓటిస్‌ ఎలివేటర్స్‌ కంపెనీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. నాయకత్వ మార్పులో భాగంగా పీ అండ్‌ జీ ప్రస్తుత సీఈఓ జాన్‌ మోల్లెర్‌ స్థానంలో శైలేష్‌ నియ మితులయ్యారు. ఈ అక్టోబరులో జరగనున్న వాటాదారుల సమావేశంలో డైరెక్టర్‌ పదవికి పోటీ చేసేందుకు సైతం కంపెనీ బోర్డు జెజురికర్‌ను నామినేట్‌ చేసినట్లు పీ అండ్‌ జీ తెలిపింది.

శైలేష్‌ సోదరుడూ సీఈఓనే.. : మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ ఆటో, వ్యవసాయ యంత్రాల విభాగ సీఈఓ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజురికర్‌ చిన్న తమ్ముడే శైలేష్‌. కాగా, భారతీయ సంతతి నాయకులు కేవలం సాంకేతికతనే కాదు, అమెరికన్‌ వినియోగదారుల హృదయాలను, మనస్సులను కూడా దోచుకోగలరని పీ అండ్‌ జీ సీఈఓగా శైలేష్‌ నియామకం మరోసారి నిరూపించిందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు.

హెచ్‌పీఎ్‌స పూర్వ విద్యార్థి.. నాదెళ్ల క్లాస్‌మేట్‌

శైలేష్‌ జెజురికర్‌కు హైదరాబాద్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. అంతేకాదు, హెచ్‌పీఎస్‌లోనే చదువుకున్న మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల క్లాస్‌మేట్‌ కూడా. వీరిద్దరూ స్నేహితులని కూడా తెలిసింది. జెజురికర్‌, నాదెళ్లతోపాటు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాజీ సీఈఓ అజయ్‌ బంగా, అడోబ్‌ సీఈఓ శాంతను నారాయణ్‌ కూడా హెచ్‌పీఎ్‌స పూర్వ విద్యార్థులే. జెజురికర్‌ విషయానికొస్తే, హెచ్‌పీఎ్‌సలో విద్యాభ్యాసం అనంతరం ముంబై యూనివర్సిటీ నుంచి బీఏ ఎకనామిక్స్‌, ఆ తర్వాత ఐఐఎం లక్నో నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 05:15 AM