Market Rally: సెన్సెక్స్ మళ్లీ 81000 పైకి
ABN, Publish Date - Aug 05 , 2025 | 05:37 AM
స్టాక్ మార్కెట్లో రెండ్రోజుల వరుస నష్టాలకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మెటల్, ఆటో, కమోడిటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు...
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండ్రోజుల వరుస నష్టాలకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మెటల్, ఆటో, కమోడిటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెంచడంతో సూచీలు సోమవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్.. 418.81 పాయింట్ల లాభంతో 81,018.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 157.40 పాయిం ట్ల వృద్ధితో 24,722.75 వద్ద స్థిరపడింది.
7న ఆల్ టైం ప్లాస్టిక్స్ ఐపీఓ
కన్స్యూమర్‌వేర్ ఉత్పత్తుల తయారీదారు ఆల్ టైం ప్లాస్టిక్స్ రూ.401 కోట్ల ఐపీఓ ఈనెల 7న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.260-275గా నిర్ణయించింది.
డిజిటల్ హెల్త్ టెక్ ప్లాట్‌ఫామ్ ప్రాక్టో.. త్వరలో ఐపీఓకు రావాలనుకుంటోంది. ఇప్పటివకే అంతర్జాతీయం గా 5 కోట్ల మంది పేషెంట్లకు సేవలందించిన ఈ వేదికకు 5 లక్షలకు పైగా వైద్యులు అనుసంధానితమై ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 05:37 AM