ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్వల్ప లాభంతో సరి

ABN, Publish Date - Apr 30 , 2025 | 06:04 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్‌లో 442 పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్‌.. చివరి వరకు అదే జోరును...

సెన్సెక్స్‌ 70 పాయింట్లు అప్‌

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్‌లో 442 పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్‌.. చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, 70.01 పాయింట్ల స్వల్ప లాభంతో 80,288.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 7.45 పాయింట్ల పెరుగుదలతో 24,335.95 వద్ద ముగిసింది. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎ్‌ఫఐఐ) పెట్టుబడులు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 13 మాత్రమే రాణించాయి. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు 2.32 శాతం లాభంతో 4 నెలల గరిష్ఠానికి చేరడంతో పాటు వరుసగా రెండో రోజు సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కాగా, బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.23 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ, ఫోకస్డ్‌ ఐటీ సూచీలు మాత్రం ఒక శాతానికి పైగా పెరిగాయి.

  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.1,050 పెరిగి రూ.99,450కి చేరగా.. సిల్వర్‌ రూ.3,500 పెరుగుదలతో రూ.1.02 లక్షలకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 3,311 డాలర్లు, సిల్వర్‌ 33.28 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 30 , 2025 | 06:04 AM